Ram Charan Pawan Kalyan: రీసెంట్ గానే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కేవలం సినీ హీరో గా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా కొనసాగాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ని రీ యాక్టీవ్ చేసాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తో కలిసి వరుసగా ఆయన నాలుగు చిత్రాలను నిర్మించబోతున్నాడు. అందులో రెండు సినిమాల్లో ఆయనే హీరో గా నటిస్తుండగా, మరో రెండు సినిమాలు ఇతర హీరోలతో చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగం గా తన అబ్బాయి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ని పెట్టి ఒక భారీ బడ్జెట్ మూవీ ని చెయ్యాలని ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి తన ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వం వహించబోతున్నాడు. రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఎప్పుడో ఒక సినిమా రావాల్సి ఉంది. కానీ ఇద్దరికీ వేర్వేరు కమిట్మెంట్స్ ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళలేదు.
అయితే ఎట్టకేలకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ కాంబినేషన్ ని సెట్స్ మీదకు తీసుకొని రాబోతుండడం మెగా అభిమానులకు ఒక పండగ లాంటి వార్త అనే చెప్పాలి. అయితే రామ్ చరణ్ స్థాయి ఇప్పుడు చాలా పెద్దది. ఆయన నుండి ఒక సినిమా విడుదల అవుతుందంటే, ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ స్కేల్ సినిమా అయ్యుంటుందనే అంచనాలు ఉంటాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాంటి సినిమాలు తీసే టైపు కాదు. ఆయనతో సినిమా అంటే ఫ్యామిలీ జానర్ లేదా ఎంటర్టైన్మెంట్ జానర్ లోనే ఉంటుంది. ఒక పాన్ ఇండియా స్టార్ నుండి ఇలాంటి సినిమా వస్తే ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మరోపక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వగానే ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్ తో ‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రం చేస్తాడు.
కార్తికేయ స్వామి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే ఈ సినిమాకు మంచి డిమాండ్ ఉంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ కోసం కోల్డ్ వార్ చేసుకుంటున్నారు. మా రామ్ చరణ్ తో చేస్తే అలాంటి ప్రాజెక్ట్ చెయ్యి, లేదంటే అసలు వద్దు అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు త్రివిక్రమ్ ని డిమాండ్ చేస్తున్నారు. మరి త్రివిక్రమ్ రామ్ చరణ్ కోసం ఎలాంటి సబ్జెక్టు ని ఎంపిక చేస్తాడో చూడాలి. ఇది తన మిత్రుడు పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థ నుండి రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి, త్రివిక్రమ్ కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటాడని, పాన్ ఇండియా సబ్జెక్టు తోనే వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
