Sankranthi Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు సినిమాల సందడి మొదలవుతుంది. గతవారం మొత్తం సంక్రాంతి సినిమాలు బరిలో నిలవడమే కాకుండా వచ్చిన సినిమాలు వచ్చినట్టు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… మొదట ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో కంటెంట్ ప్రేక్షకుడికి అర్థం కాకపోవడంతో సినిమా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. ఇక ఈ సినిమా తరువాత వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ఆడియన్స్ ను రిపిటెడ్ గా థియేటర్ కి రప్పించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం… రవితేజ హీరోగా వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సైతం విజయాన్ని సాధించింది. ‘నవీన్ పోలిశెట్టి’ హీరోగా వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ శర్వానంద్ హీరోగా వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలు సైతం డీసెంట్ హిట్ ను సొంతం చేసుకున్నాయి…ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ సంక్రాంతికి వచ్చే సినిమాల్లో పెద్దగా స్టోరీ లేకపోయిన పర్లేదు ఫ్యామిలీ చూసే విధంగా సినిమాలు ఉంటే చాలు ఆ సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలుస్తాయి.
అంటూ కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో స్టోరీ అంత ప్రాపర్ గా ఏ సినిమాలోనూ లేదు. కానీ కామెడీ చేస్తూ ఫ్యామిలీని నవ్వించగలిగితే చాలు ఆ సినిమాలు సూపర్ హిట్ అయిపోతాయి అనే ఒక మార్కును ఈ సంక్రాంతి సినిమాలన్నీ ప్రూవ్ చేశాయి…
నిజానికి ఈ సినిమాలన్నీ మిగతా రోజుల్లో వచ్చుంటే ఎలాంటి టాక్ ను మూటగట్టుకునేవో తెలియదు. కానీ సంక్రాంతికి వచ్చాయి కాబట్టి ఇప్పుడు సినిమాలను చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే మిగతా రోజులతో పోలిస్తే పండగ రోజుల్లో ప్రేక్షకులందరు కామెడీని ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. కాబట్టి కామెడీ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ సూపర్ సక్సెస్ లను సాధిస్తాయి.
ఇక దాంతో సంక్రాంతికి వచ్చే సినిమాల్లో పెద్దగా కథ ఉండాల్సిన పనిలేదు. ఈజీగా సక్సెస్ లను సాధిస్తాయి అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కలిగింది. ఇక రాబోయే రోజుల్లో సంక్రాంతి కి వచ్చే సినిమాల్లో పెద్దగా కథలేకపోతే ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేయగలిగితే చాలా? ఆ సినిమాలు గొప్ప విజయాలను సాధిస్తాయా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతాయి…
