https://oktelugu.com/

రామ్ చరణ్ కొత్త సినిమా ఓపెనింగ్ డేట్ ఫిక్స్ !

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ అంటూ సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వంశీ పైడిపల్లికి మొత్తానికి స్టార్ హీరోతో సినిమా ఫైనల్ అయింది. నిజానికి మహర్షి లాంటి ఓ రేంజ్ హిట్ వచ్చాక… డైరెక్టర్ గా వంశీకి ఫుల్ డిమాండ్ ఉండాలి. కానీ, అందుకు పూర్తి విరుద్ధంగా వంశీకి ఏ హీరో డేట్స్ ఇవ్వలేదు. మొదట వంశీ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్బా బుతోనే మళ్లీ చేయాలనుకున్నాడు. అయితే వంశీ చెప్పిన కథ […]

Written By:
  • admin
  • , Updated On : December 10, 2020 / 01:14 PM IST
    Follow us on


    సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ అంటూ సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వంశీ పైడిపల్లికి మొత్తానికి స్టార్ హీరోతో సినిమా ఫైనల్ అయింది. నిజానికి మహర్షి లాంటి ఓ రేంజ్ హిట్ వచ్చాక… డైరెక్టర్ గా వంశీకి ఫుల్ డిమాండ్ ఉండాలి. కానీ, అందుకు పూర్తి విరుద్ధంగా వంశీకి ఏ హీరో డేట్స్ ఇవ్వలేదు. మొదట వంశీ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్బా బుతోనే మళ్లీ చేయాలనుకున్నాడు. అయితే వంశీ చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చకపోవడంతో ఆ రకంగా వంశీతో ప్రాజెక్ట్ ను మహేష్ పక్కన పెట్టేశాడు. దాంతో వంశీ మిగిలిన స్టార్ హీరోల చుట్టూ కథ పట్టుకుని తిరిగాడు.

    Also Read: కాంట్రవర్సీ ట్వీట్ తో మహేష్, బన్నీ ఫ్యాన్స్ దగ్గర బుక్కైన సమంత

    ఈ క్రమంలోనే వంశీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను కథతో ఒప్పించాడు. చరణ్ కూడా వంశీతో సినిమాకి ఇంట్రస్ట్ గా ఉన్నాడని వార్తలు వచ్చాయి. కాకపోతే, ఆ తరువాత ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి, చరణ్ కి ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడని.. చరణ్ కూడా కథ విని బాగుందని అన్నాడని.. వచ్చే ఏడాది అక్టోబర్ లో దసరా స్పెషల్ గా ఈ సినిమాని మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. అన్నట్లు వంశీ త్వరలోనే మెగాస్టార్ ను కూడా కలిసి కథ చెప్పనున్నాడు. చిరుకి ఎలాగూ కథ నచ్చిందనే నమ్మకం ఉంది కాబట్టి.. వచ్చే దసరాకి రామ్ చరణ్ కొత్త సినిమా ఓపెనింగ్ షురూ అయినట్టే.

    Also Read: బిగ్ బాస్-4 విజేత ఆ ఇద్దర్లోనే..!

    మొత్తానికి మహేష్ కథ బాగాలేదు అన్నా.. వంశీ మాత్రం తాను రాసుకున్న స్క్రిప్ట్ ను మాత్రం బాగా నమ్మాడు. ఆ నమ్మకమే రామ్ చరణ్ ను నమ్మేలా చేసింది. ఇక ఈ సినిమా పూర్తిస్థాయి ఎమోషనల్ యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ముఖ్యంగా కేజీఎఫ్ మూవీలా క్రేజీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ సినిమా ఉంటుందని.. చరణ్ కి ఇది మరో పాన్ ఇండియా సినిమా అవుతుందని.. అందుకే వంశీ పైడిపల్లికి బడ్జెట్ కూడా భారీగా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్