Ram Charan and Buchi Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి మెగా ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా వచ్చిన కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి. ఇక ఆ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటే మాత్రం సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ (Ram Charan) తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నాడు. త్రిబుల్ ఆర్ (RRR) గ్లోబల్ స్టార్ (Global Star) గా అవతరించిన ఆయన శంకర్ (Shankar) డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్(Game Changer) సినిమాతో కొంతవరకు వెనుకబడిపోయాడు. ప్రస్తుతం బుచ్చిబాబు(Buchhi Babu) డైరెక్షన్ లో చేస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ గాని, ఉగాది కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్ గాని చాలా బాగున్నాయి. దాంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే పెరిగిపోయాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈయన చేస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ను సాధిస్తుందని ప్రతి ఒక్కరు ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి బుచ్చిబాబు మాత్రం ఈ సినిమా కోసం చాలా స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది.
Also Read : రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ గ్లింప్స్ వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!
ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసి మరోసారి రామ్ చరణ్ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక తను అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని దక్కించుకొని తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఈ సినిమా మీద రోజు రోజుకి మంచి అంచనాలైతే పెరుగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు పోస్టర్స్ తో వచ్చిన వీళ్ళు ‘శ్రీరామనవమి’ సందర్భంగా ఏప్రిల్ 6 వ తేదీన ఈ సినిమా నుంచి గ్లింప్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ గ్లింప్స్ తో సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేరుకుంటాయంటూ సినిమా మేకర్స్ అయితే హామీ ఇస్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాతో ఇటు బుచ్చిబాబు, అటు రామ్ చరణ్ ఇద్దరు కూడా పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకొని వాళ్లకు తిరుగెవ్వలేరు అని ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. బుజ్జిబాబు అయితే సుకుమార్ తన మీద ఉన్న కాన్ఫిడెంట్ తో రామ్ చరణ్ తో ఈ సినిమా చేసిన అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి సుకుమార్ నమ్మకాన్ని కూడా నిలబెట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : చిరంజీవి చేసిన సినిమాల్లో రామ్ చరణ్ కి నచ్చిన రెండు సినిమాలు ఇవేనా..?