Acharya: మెగాస్టార్ చిరంజీవి, – మెగా పవర్ స్టార్ ఒకే ప్రైమ్ లో కనిపిస్తే.. చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం ఆచార్య రూపంలో త్వరలోనే రానుంది. ఇక నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ఆచార్య’ చిత్రంలోని చెర్రీ పోషించిన సిద్ధ లుక్ ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఫ్లూట్ పై చెర్రీ డిజైన్ వేస్తున్న క్లాస్ లుక్ ఆకట్టుకుంది.

ఈ సినిమా నుంచి ఆ మధ్య వచ్చిన పోస్టర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఆ పోస్టర్ లో చరణ్ అటు వైపు తిరిగి ఉండగా, వెనుక నుండి మెగాస్టార్, చరణ్ భుజం పై చేయి వేస్తోన్న షాట్ ను ఫోటో తీసి రిలీజ్ చేశారు. ఈ ‘ఆచార్య’ రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన అన్యాయాలను అక్రమాలను అరికట్టే శక్తిగా రాబోతున్నాడట.
Also Read: NTR: హిందీ మార్కెట్ కోసం ఎన్టీఆర్ కొత్త ప్లాన్
మెగాస్టార్ నుండి ఇలాంటి సినిమా గతంలో ఎప్పుడూ రాలేదు. దాంతో ఈ నేపథ్యంలో సినిమా వస్తోంది అనేసరికి ఫ్యాన్స్ రెట్టింపు ఉత్సాహంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారికంగా కొరటాల చూపించబోతున్నాడు. పైగా ప్రస్తుతం మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేయడం ఆసక్తి రేపుతోంది.
కాజల్ ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ గా నటిస్తోందని తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడట. అలాగే ఈ చిత్రంలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఈ సినిమాని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు.

కాగా ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. అలాగే చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పైగా ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.
Team #Acharya wishes our Mega PowerStar @AlwaysRamCharan a very Happy Birthday ❤️
It is already a blockbuster year, can’t wait to make it bigger next month😎#AcharyaOnApr29
Megastar @KChiruTweets #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @MatineeEnt @adityamusic pic.twitter.com/8Xpa2Ilovv
— Konidela Pro Company (@KonidelaPro) March 27, 2022