https://oktelugu.com/

Ramcharan New Movie : రామ్ చరణ్ – జాన్వీ కపూర్- విజయ్ సేతుపతి..ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే కాంబినేషన్ రెడీ!

త్వరలోనే ఆయన ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అనే సంగతి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి కొన్ని క్రేజీ అప్డేట్స్ రీసెంట్ గానే లీక్ అయ్యి సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ చిత్రం లో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతుందట,

Written By:
  • Vicky
  • , Updated On : July 9, 2023 / 01:48 PM IST
    Follow us on

    Ramcharan New Movie : #RRR చిత్రం తర్వాత పాన్ వరల్డ్ స్టార్ ఇమేజి ని దక్కించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఈ సినిమా తర్వాత శంకర్ తో గేమ్ చేంజర్ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 70 శాతం కి పైగా పూర్తి అయ్యింది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా పై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది.

    అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు కేవలం ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ని మాత్రమే విడుదల చేసారు. దీనికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, ఫ్యాన్స్ టీజర్ కోసం చాలా కాలం నుండి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మేకర్స్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడం తో ట్విట్టర్ లో మేకర్స్ కి నిరసనగా భారీ ఎత్తున నెగటివ్ ట్రెండ్ కూడా చేసారు.

    ‘గేమ్ చేంజర్’ సంగతి కాసేపు పక్కన పెడితే , త్వరలోనే ఆయన ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అనే సంగతి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి కొన్ని క్రేజీ అప్డేట్స్ రీసెంట్ గానే లీక్ అయ్యి సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ చిత్రం లో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతుందట, రీసెంట్ గానే డైరెక్టర్  ఆమెని కలిసి ఓకే చేయించుకున్నట్టు తెలుస్తుంది.

    అంతే కాకుండా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం తమిళ క్రేజీ హీరో విజయ్ సేతుపతి ని తీసుకున్నారట. ఇందులో ఆయనది నెగటివ్ క్యారక్టర్ కాదు కానీ, కథలో చాలా బలమైన పాత్ర అని తెలుస్తుంది. ఇక ఆస్కార్ అవార్డు విజేత AR రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం వహించబోతున్నట్టు సమాచారం. సెప్టెంబర్ నెల నుండి షూటింగ్ ప్రారంభం కాబోతుందట.