Allu Arjun Atlee Movie Update: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు మంచి కాన్సెప్ట్ లతో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలు ఎన్ని సినిమాలు చేసినప్పటికి పాన్ ఇండియాలో వాళ్ళు చేసిన సినిమాలకు గొప్ప ఆదరణ దక్కుతోంది. ఇకమీదట వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు… ‘పుష్ప 2’ సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించాడు. ఇక అల్లు అర్జున్ ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కొంతవరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది…అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా విషయంలో ఆయన చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తున్నాడు… ఇక ఇప్పటివరకు అల్లు అర్జున్ భారీ గ్రాఫికల్ మూవీ ఒక్కటి కూడా చేయలేదు.
తను కమర్షియల్ సినిమాలను మాత్రమే చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక పుష్ప సినిమా మాత్రమే అసలు ఆయనకి చాలా వరకు ప్లస్ అయింది. అప్పటివరకు అల్లు అర్జున్ చేసిన క్యారెక్టర్స్ చాలా డీసెంట్ గా ఉండేవి. పుష్ప సినిమాలో మాత్రం చాలా వైల్డ్ క్యారెక్టర్ ని పోషించి పుష్పరాజ్ పాత్రకి ఒక ఐడెంటిటిని తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో వస్తున్న సినిమా అలా కాదు సూపర్ హీరో కథతో తెరకెక్కబోతోంది.
కాబట్టి ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎలా నటిస్తాడు తనను తాను ఎలా ప్రూవ్ చేసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. అట్లీ సైతం ఇప్పటి వరకు డిఫరెంట్ సినిమాలను చేయలేదు…కొన్ని సినిమాల్లోని సీన్స్ ను కాపీ చేసి అటు ఇటు తిప్పి సినిమా చేసి మంచి విజయాలను సాధించాడు. ఆయన ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు అంటే అది అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అట్లీ ఈ సినిమాను పెర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…సినిమా లో గ్రాఫిక్స్ వర్క్ ఉండటం వేరు…కానీ ఈ సినిమా మొత్తం గ్రాఫిక్స్ షాట్స్ ఉంటాయి కాబట్టి అట్లీ అల్లు అర్జున్ ను ఎలా చూపిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…అలాగే వీళ్ళిద్దరికి ఈ సినిమా చాలా స్పెషల్ కాబట్టి ఈ మూవీ గొప్ప విజయాన్ని సాధించాలి. లేకపోతే మాత్రం ఇద్దరి ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…