https://oktelugu.com/

ప్చ్.. అయోమయంలో రామ్ చరణ్ !

‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ తో సినిమా సెట్ చేసుకోవడానికి చాలా సిట్టింగ్స్ కూర్చోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో చెర్రీ, ప్రశాంత్ నీల్ తో సినిమాని ప్లాన్ చేసుకునే అవకాశం వచ్చినా.. లైట్ తీసుకున్నాడు. తీరా ఇప్పుడు దర్శకుడు శంకర్, ‘ఇండియన్ 2’ లీగల్ సమస్యల నుంచి సులువుగా బయట పడతాడనే నమ్మకం రోజురోజుకు తగ్గిపోతుంది. నిజానికి శంకర్ సెప్టెంబర్ లో రామ్ చరణ్ తో ఎలాగైనా సినిమా మొదలుపెట్టాలని పట్టుదలగా ఉన్నా.. […]

Written By: , Updated On : June 18, 2021 / 02:38 PM IST
Follow us on

Ram Charan
‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ తో సినిమా సెట్ చేసుకోవడానికి చాలా సిట్టింగ్స్ కూర్చోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో చెర్రీ, ప్రశాంత్ నీల్ తో సినిమాని ప్లాన్ చేసుకునే అవకాశం వచ్చినా.. లైట్ తీసుకున్నాడు. తీరా ఇప్పుడు దర్శకుడు శంకర్, ‘ఇండియన్ 2’ లీగల్ సమస్యల నుంచి సులువుగా బయట పడతాడనే నమ్మకం రోజురోజుకు తగ్గిపోతుంది.

నిజానికి శంకర్ సెప్టెంబర్ లో రామ్ చరణ్ తో ఎలాగైనా సినిమా మొదలుపెట్టాలని పట్టుదలగా ఉన్నా.. లైకా అతన్ని వదిలిపెట్టేలా లేదు. శంకర్ తమ సినిమా నుండి తప్పుకుంటే.. అతన్ని కోర్టుకు లాగడానికి కూడా సన్నద్ధంగా ఉంది లైకా సంస్థ. దాంతో రామ్ చరణ్ కి భయం పట్టుకుంది. ఒక విధంగా అయోమయంలో ఉన్నాడు. ఈ కేసు ఇప్పట్లో తేలకపోతే శంకర్ తనతో సినిమా చేయలేడు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత వచ్చే పాన్ ఇండియా ఇమేజ్ ను కాపాడుకోవాలి అంటే.. పాన్ ఇండియా డైరెక్టర్ తోనే సినిమా చేయాలి.

కానీ, శంకర్ ను నమ్ముకుంటే తాను బుక్కవుతాననే అపనమ్మకం రామ్ చరణ్ కి ఎక్కువైంది. అందుకే, మరో పాన్ ఇండియా డైరెక్టర్ కోసం చెర్రీ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇప్పటికే ఓ ఆప్షన్ కూడా రెడీ చేసుకున్నాడని తెలుస్తోంది. ఆలాగే ముందు జాగ్రత్తగా చరణ్ బాలీవుడ్ స్టార్ దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నారని టాక్. మరి చరణ్ తో సినిమా అంటే.. ఏ డైరెక్టర్ ఒప్పుకుంటాడో చూడాలి.

మరోపక్క చరణ్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలు షూటింగ్ కోసం రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఆగస్టు లోపు పూర్తి అవ్వనున్నాయి. అంటే చరణ్ ఆగస్టు లోపు మరో సినిమా సెట్ చేసుకోవాలి. ఒకవేళ శంకర్ అందుబాటులో ఉంటే.. ఆగస్టు మూడో వారం నుండి శంకర్ డైరెక్షన్లో భారీ పాన్ ఇండియా సినిమాని స్టార్ట్ చేస్తాడు.