Ram Charan Upasana Vacation: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ కుమారుడైనా.. రామ్ చరణ్ కు స్పెషల్ ఇమేజ్ ఉంది. ఓ వైపు నటుడిగా.. మరోవైపు నిర్మాతగా కొనసాగుతున్న ఈ యంగ్ హీరో సినిమాలంటే ఫ్యాన్స్ పడిచస్తారు. రామ్ చరన్ కొన్ని నెలలుగా సినిమాలో బిజీగా మారాడు. రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో చెర్రీ ఒక హీరో. ఈ సినిమా కోసం ఈ యంగ్ హీరో బిజగా మారాడు. అలాగే ‘ఆచార్య’లో నటించడంతో పాటు నిర్మాతగా ఉండడంతో ఆయనకు తీరిక లేకుండా పోయింది. మరోవైపు శంకర్ డైరెక్షన్లో ఓ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే రాజమండ్రిలో ప్రారంభమైంది. దీంతో నిత్యం బిజీ లైఫ్ ను గడిపేస్తున్న రామ్ ఫ్యామిలీకి కేటాయించలేకపోతున్నాడు. అయితే ఇప్పడు కాస్త చాన్స్ దొరకడంతో ఆయన సతీమణి ఉపాసనతో కలిసి టూర్ కు వెళ్తున్నాడు.

రామ్ చరణ్ కు ఆయన భార్య ఉపాసన అన్ని విషయాల్లోనూ అండగా ఉంటుంది. సినిమా విషయాల్లోనూ అప్పుడప్పుడు సందడి చేస్తుంటారు. కొన్ని ముఖ్యమైన ఫంక్షన్లకు ఈ యంగ్ కపుల్స్ అటెండ్ అవుతూ ఉంటారు. అయితే తాజాగా వీరిద్దరు కలిసి వెకెషన్ కు వెళ్లున్నట్లు సోషల్ మీడియాల ఓ పోస్టు పెట్టారు. ప్రస్తుతం అది వైరల్ గా మారింది. కానీ వీరిద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారనేది మాత్రం చెప్పలేదు. సినీ ఇండస్ట్రీలోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట వెకేషన్ వెళ్తుండడం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు రెండేళ్లపాటు బిజీ లైఫ్ ను గడిపిన రామ్ కు ఇప్పుడు విరామం దొరికింది. దీంతో యంగ్ కపుల్స్ సరదాగా టూర్ వేసుకున్నారు.
Also Read: Prabhas Biography: బయోగ్రఫీ: ప్రభాస్ ఎలా ఎదిగాడో తెలుసా?
‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఇందుకు సంబంధిన లుక్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఇందులో మంచి ఫిట్ నెస్ గా కనిపిస్తున్నాడు రామ్ చరన్. ఇందులో మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు. అయితే ఇద్దరిని సమానంగా చూపిస్తారని అంటున్నారు. రాజమౌళి కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన ‘మగధీర’ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ కూడా అదే రేంజ్లో ఉంటుందని అంటున్నారు. పాన్ ఇండియా లెవల్లో చిత్రీకరించిన ఈ మూవీకి భారీ బడ్జెట్ పెట్టారు. అంతకంటే ఎక్కువే వసూళ్లు రాబడుతుందని ఆశిస్తున్నారు. అయితే ఈ నెల 25న తరువాత సినిమా రేంజ్ గురించి అర్థమవుతుందని సినీ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

మరోవైపు ఆయన చిరంజీవితో కలిసి ‘ఆచార్య’లోనూ నటించారు. ఇందులో నక్సలైట్ గా కనిపించనున్నారు. ఈ సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ‘ఆచార్య’ సినిమాలో నటించడమే కాకుండా ఆ సినిమాకు నిర్మాతల్లో రామ్ చరణ్ ఒకరు. దీంతో ఈ మూవీపై భారీ ఎక్సపెక్టెషన్స్ పెరిగాయి. మరోవైపు శంకర్ డైరెక్షన్లోనూ రామ్ చరణ్ ఓ సినిమాకు ఇటీవలే ప్రారంభోత్సవం చేశారు. ఇందులో హాలీవుడ్ లెవల్లో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే సినిమా లైఫ్ తో బిజీగా మారిన రామ్ కు ఇప్పుడు కాస్త విరామం దొరికింది. అందుకే ఆయన సతీమణితో కలిసి వెకేషన్ కు వెళ్తున్నట్లు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.ఈ ఫొటోస్ నెట్టింట్ల తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: Tollywood Trends : టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !