Ram Charan : ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram Charan) బుచ్చి బాబు(Buchi Babu Sana) తో చేస్తున్న చిత్రం ఎలాంటి బ్రేక్స్ లేకుండా జెట్ స్పీడ్ లో షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ప్రస్తుతం లేట్ నైట్స్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్(Jhanvi Kapoor) లపై పలు కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. దాదాపుగా వారం రోజుల నుండి ఈ షెడ్యూల్ జరుగుతూ ఉంది. గ్రాఫిక్స్ పెద్దగా అవసరం లేని సినిమా కాబట్టి, ఈ ఏడాది లోనే ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. కానీ రామ్ చరణ్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం వల్ల ఈ సినిమా ఈ ఏడాది విడుదల కష్టమే అని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. మన అందరికీ తెలిసిందే, ఇటీవల కాలం లో ఒక సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయ్యేది ఓటీటీ డీల్ పూర్తి అయ్యాకనే.
Also Read : రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా కోసం భారీ సెట్ వేశారా..?
ఈ చిత్రానికి ఓటీటీ డీల్ ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్ వంటి ఓటీటీ సంస్థలు నిర్మాతలు ఎంత డబ్బులు డిమాండ్ చేస్తే అంత ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నారు. కానీ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ఆ ఓటీటీ సంస్థలకు ఇవ్వడానికి అసలు ఒప్పుకోవడం లేదు. అమెజాన్ ప్రైమ్ క్రేజ్ ఇప్పుడు బాగా తగ్గిపోయింది. కొత్త సినిమాలు పెద్దగా కొనకపోవడం వల్ల యూజర్లు మళ్ళీ రెన్యువల్ చేసుకోవడం లేదు. పైగా నెట్ ఫ్లిక్స్ కి ఉన్నంత రీచ్ లో పావు శాతం కూడా అమెజాన్ ప్రైమ్ కి ఉండదు. సోనీ లివ్ పరిస్థితి కూడా అంతే. అందుకే రామ్ చరణ్ ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ కి మాత్రమే అమ్మాల్సిందిగా నిర్మాతలకు చాలా గట్టిగా చెప్పాడట. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ కి గ్లోబల్ వైడ్ రీచ్ ఉంది.
ఈమధ్య మన సినిమాలను ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎగబడి చూస్తున్నారు. #RRR చిత్రానికి గ్లోబల్ వైడ్ గా రీచ్ రావడానికి, ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడానికి కూడా కారణం నెట్ ఫ్లిక్స్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. అలాంటి పవర్ ఫుల్ ఓటీటీ మీడియం అది. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు తో చేస్తున్న చిత్రం కూడా #RRR రేంజ్ లో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసే కంటెంట్ ఉన్న సినిమా అట. అందుకే ఆయన ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లోనే విడుదల చేయాలని పట్టుబడుతున్నాడు. కానీ నెట్ ఫ్లిక్స్ బడ్జెట్ ఈ ఏడాదికి పూర్తి అయిపోయింది, స్లాట్స్ ఖాళీ లేదు. దీంతో ఈ చిత్రం ఈ ఏడాది విడుదల అవ్వడం కష్టమేనని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఒకవేళ రామ్ చరణ్ ఇతర ఓటీటీ సంస్థలకు అమ్మడానికి ఒప్పుకుంటే ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కావొచ్చు.
Also Read : రాజాసాబ్ మూవీలో అంత మేటర్ ఉందా? 10 ఏళ్ళు దాక మర్చిపోరట, హైప్ పెంచేసిన స్టార్ కమెడియన్