Ram Charan Chikiri Chikiri Video Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం ‘పెద్ది'(Peddi Movie) మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ‘గేమ్ చేంజర్’ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత అభిమానులు చరణ్ ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలి అనే కసితో ఉన్నారు. పైగా పెద్ది చిత్రం రూరల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుండడంతో రంగస్థలం లాగా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వుధి అనే ఆశతో ఉన్నారు. స్టోరీ బలంగా రాసుకున్నాడేమో తెలియదు కానీ, ఎందుకో డైరెక్టర్ బుచ్చి బాబు కి అనుభవ లేమి కారణంగా, రామ్ చరణ్ లాంటి స్టార్ ని సరిగా హ్యాండిల్ చేస్తాడా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఇక నేడు విడుదల చేసిన ‘చికిరి’ పాట ఫ్యాన్స్ లో మరింత భయాన్ని కలిగించాయి. మొన్న విడుదలైన ప్రోమో కి సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ట్రోల్స్ పడ్డాయో మనమంతా చూసాము.
Also Read: నేడే మహేష్,రాజమౌళి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..కానీ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏమిటంటే!
ఇక నేడు విడుదలైన పూర్తి వీడియో సాంగ్ కి కూడా సోషల్ మీడియా లో అదే రేంజ్ ట్రోల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా లిరిక్స్ అసలు బాగాలేవని అంటున్నారు. రెహమాన్ లాంటి సంగీత దర్శకుడితో ఇలాంటి ‘బొక్క’,’తిక్క’, ‘దీనక్క’ లాంటి పదాలు ఉన్న లిరిక్స్ కు ట్యూన్ చేయిస్తారా?, ఆయన రేంజ్ ఏంటో తెలుసా మీకు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ బుచ్చి బాబు ని ట్యాగ్ చేసి తిడుతున్నారు. పైగా పాట కూడా తెలుగు నేటివిటీ కి తగ్గట్టు లేదు. ఒక తమిళ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు పెద్దగా రాకుండా కంపోజ్ చేస్తే ఎలా ఉంటుందో, అలా ఈ పాట ఉందని అంటున్నారు నెటిజెన్స్. ఇక రామ్ చరణ్ డ్యాన్స్ మూవ్మెంట్స్ కొన్ని బాగున్నాయి. కానీ అవే స్టెప్పులు పాట మొత్తం రిపీట్ అయ్యినట్టు చూసిన ఆడియన్స్ కి అనిపిస్తోంది. జానీ మాస్టర్ ఇంకా గొప్పగా కంపోజ్ చేయొచ్చు.
ఓవరాల్ గా పాటకు సోషల్ మీడియా ఆడియన్స్ నుండి బిలో యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ‘పెద్ది’ మీద మెగా అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం తో రామ్ చరణ్ వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతాడని బలమైన నమ్మకం తో ఉన్నారు. ఇక నటన విషయం లో అయితే రంగస్థలం ని మించి ఉంటుందని అంటున్నారు. కానీ మొదటి పాట అభిమానులను కాస్త నిరాశకు గురి చేసింది. మిగిలిన పాటలైనా బాగుంటే ఫ్యాన్స్ లో ఏర్పడిన ఈ నెగిటివ్ ఫీలింగ్ కాస్త పోతుంది. లేదంటే సినిమాకు కావాల్సిన హైప్ రాదు, కావాల్సిన ఓపెనింగ్ కూడా రాదు. ఏమి జరగబోతుందో చూడాలి మరి. ఈ చిత్రం వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చ్ 27 న విడుదల కాబోతోంది.
