
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో చరణ్ పాత్రకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. దాదాపు 40 నిమిషాల పాటు కనిపించే సిధ్ధ అనే లెంగ్తీ రోల్ ను చరణ్ ప్లే చేస్తున్నాడని, సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో చరణ్ పాత్ర చనిపోతుందని తెలుస్తోంది.
మరి, చరణ్ పాత్ర చనిపోతే మెగా అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా ? అసలు చరణ్ చనిపోయే పాత్రకు చిరంజీవి ఎలా ఒప్పుకుంటారు ? అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఏమన్నా ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందని తెలుస్తోంది.
ఇక మెగా మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.
అన్నట్టు జులై నుండి తరువాత షెడ్యూల్ మొదలవనుంది. ఐతే, తరువాత షెడ్యూల్ ను ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేస్తారట. ఈ షెడ్యూల్ లో కాజల్ పాల్గొననుంది. పైగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అవడంతో… చిరు లుక్ కూడా చాల సరికొత్తగా ఉంటుందట. ఇక ఈ చిత్రంలో యుంగ్ బ్యూటీ రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో అలరించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.