Ram Charan and Buchi Babu : ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) లాంటి భారీ ఫ్లాప్ సినిమా తర్వాత రామ్ చరణ్(Global Star Ram Charan) తన కెరీర్ పై ఇక నుండి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటూ, ఫుల్ ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగానే ఆయన ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు(Buchi Babu Sana) తో ఒక సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ సినిమా, జెట్ స్పీడ్ వేగంగా కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ ముందుకు పోతుంది. ప్రస్తుతం ఢిల్లీ లో మూడవ షెడ్యూల్ ని జరుపుకుంటున్న ఈ సినిమా, అతి త్వరలోనే నాల్గవ షెడ్యూల్ ని కూడా మొదలు పెట్టుకోనుంది. ఈ షెడ్యూల్ లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా పాల్గొనబోతున్నాడు. రీసెంట్ గానే ఆయనకు సంబంధించిన లుక్ టెస్ట్ ని కూడా పూర్తి చేసింది మూవీ టీం. అందుకు సంబంధించిన వీడియోని కూడా విడుదల చేసారు.
Also Read : రామ్ చరణ్, బుచ్చి బాబు సినిమాకు విచిత్రమైన టైటిల్..కంగుతిన్న అభిమానులు..ఇదేమి పిచ్చి సామీ!
అదే విధంగా హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్(Jhanvi Kapoor) క్యారక్టర్ కి సంబంధించిన లుక్ ని కూడా ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీ షర్ట్, నైట్ ప్యాంట్ ని ధరించి, చేతిలో గొర్రె పిల్లని వేసుకొని వస్తున్న ఆమె లుక్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కానీ ఇది ఫస్ట్ లుక్ మాత్రం కాదట, షూటింగ్ సమయంలో ఆమె సరదాగా తీసుకున్న ఫోటో అని అంటున్నారు. ఈ చిత్రం రూరల్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కనుంది. ‘రంగస్థలం’ చిత్రంతో రామ్ చరణ్ కి నటన పట్ల ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సినిమాలో కూడా ఆయన నటన ఆ రేంజ్ లో ఉండబోతుందని టాక్. ఛాలెంజింగ్ రోల్స్ లో రామ్ చరణ్ ని నటించమంటే జీవించేస్తాడు. రీసెంట్ గా విడుదలైన ‘గేమ్ చేంజర్’ చిత్రం అందుకు ఉదాహరణ.
సినిమా టేకింగ్ బాగలేకపోవడం వల్ల ఫ్లాప్ అయ్యింది కానీ, ఇందులో రామ్ చరణ్ నటనకు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అతి కష్టమైన అప్పన్న క్యారక్టర్ లో ఆయన ఎంతలా జీవించాడో మనమంతా చూసాము. నత్తి క్యారక్టర్ ని ఇంత సహజంగా నటించిన నటుడిని ఇప్పటి వరకు చూడలేదంటూ కామెంట్స్ వినిపించాయి. అలాంటి అద్భుతమైన క్యారక్టర్ ఫుల్ లెంగ్త్ గా చేయబోతున్నాడు బుచ్చి బాబు సినిమాలో రామ్ చరణ్. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే, ఈ సినిమా షూటింగ్ అప్పుడే 30 శాతం కి పైగా పూర్తి అయ్యిందట. గ్రాఫిక్స్ వర్క్ తో పెద్దగా అవసరం లేని సినిమా కావడంతో సాధ్యమైనంత తొందరగా సినిమాని పూర్తి చేసి ఈ ఏడాది లోనే విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. మార్చి 28 న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో, ఆ రోజున ఈ సినిమాకి సంబంధించిన బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.