Ram Charan and Buchi Babu : ‘గేమ్ చేంజర్’ లాంటి డిజాస్టర్ ఫ్లాప్ తగిలిన తర్వాత ఏ హీరోకి అయినా మామూలు పరిస్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. మహేష్ బాబు లాంటోళ్ళు ఇలాంటి ఫ్లాప్ తగిలినప్పుడు కనీసం ఏడాది పాటు అజ్ఞాతంలోకి వెళ్లి ఆ తర్వాత కొత్త సినిమా గురించి ఆలోచిస్తారు. కానీ రామ్ చరణ్ కి ముందుగానే ఈ సినిమా ఫలితం గురించి క్లారిటీ ఉందో ఏమో తెలియదు కానీ, ఆయన ఆ డిప్రెషన్ నుండి తొందరగా కోలుకొని బుచ్చి బాబు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అది కూడా ఆయన విపరీతమైన జ్వరం లో కూడా రాత్రులు ఎముకలు కొరికే సమయంలో షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రామ్ చరణ్ లో హిట్ కొట్టాలనే కసి బాగా పెరిగిందని అభిమానులు ఆయన పడుతున్న కష్టాన్ని చూసి మురిసిపోయారు. సినిమాలో చాలా బలమైన కంటెంట్ ఉందని, రంగస్థలం చిత్రం తర్వాత ఈ సినిమా ఆయన కెరీర్ లో మరో మైలు రాయిగా నిలిచిపోతుందని అనేక ఇంటర్వ్యూస్ లో కూడా తెలిపాడు రామ్ చరణ్.
అయితే ఈ సినిమాకి టైటిల్ విషయం లో అభిమానులు కాస్త భయపడుతున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రం గురించి చెప్పిన మాటలకు, టైటిల్ కి అసలు సంబంధం లేదే అని సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ ని పరిశీలించారు. కానీ ఇప్పుడు ‘పవర్ క్రికెట్’ అనే టైటిల్ ని పెట్టేందుకు పరిశీలిస్తున్నారని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం క్రికెట్ మీద ఉంటుందట, సెకండ్ హాఫ్ కుస్తీ మీద ఉంటుందట. అందుకే ఆ రెండు పేర్లు కలిసొచ్చేలా ఈ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. కానీ అభిమానులకు ఈ టైటిల్ అసలు నచ్చలేదు. దీనికంటే ‘పెద్ది’ అనే టైటిల్ బాగుంది అంటూ చెప్పుకొస్తున్నారు.
‘పవర్ క్రికెట్’ అనే టైటిల్ సీరియస్ టోన్ లో లేదని, ఇలాంటి సినిమాలకు అలాంటి టైటిల్స్ పెడితే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరని, దయచేసి వేరే ఏదైనా టైటిల్ పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి అభిమానుల అభిప్రాయం మూవీ టీం వరకు చేరుతుందా లేదా అనేది చూడాలి. విరామం లేకుండా రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమాని, సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి, అక్టోబర్ నెలలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం లో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందిన నటీనటులు నటించే అవకాశం ఉంది. ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఒక ముఖ్య పాత్ర పోషించేందుకు సిద్దమయ్యాడు. అదే విధంగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ కూడా ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడని టాక్.