Ram Charan and Buchi Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఆయన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ సపరేట్ ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తను చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న రామ్ చరణ్ ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో గ్లోబల్ స్టార్ (Global Star) గా అవతరించాడు. ఇక ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు (Buchhibabu) డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఒక భారీ సెట్ ను కూడా వేసినట్టుగా తెలుస్తోంది…ఈ సెట్ కోసమే దాదాపు 10 కోట్ల వరకు ఖర్చు పెట్టారట. ఇక ఫుట్ బాల్ నేపధ్యంలో సాగుతున్న ఈ సినిమా కోసం ఒక ఫుట్ బాల్ స్టేడియంను నిర్మించే ప్రయత్నం అయితే చేశారట. దానికోసమే 10 కోట్ల వరకు ఖర్చయినట్టుగా తెలుస్తోంది.
Also Read : అప్పుడే 30 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందా..రామ్ చరణ్, బుచ్చి బాబు సినిమా గురించి సెన్సేషనల్ అప్డేట్!
ఇక ఈ సినిమా మొత్తానికి సంబంధించిన షూట్ 20 పర్సెంట్ ఈ సెట్లోనే జరగబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అందుకోసమే ఇప్పుడు ధైర్యం చేసి మరి అంత పెద్ద సెట్ ను నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఉన్నాడనే ధైర్యంతోనే ఈ సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది.
ఇక ఇంతకుముందు ఆయన చేసిన గ్లిమ్స్ ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. మరి రాబోయే సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆయనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. కాబట్టి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమా తర్వాత బాలీవుడ్ లో రామ్ చరణ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరిగిపోయింది. ఇక ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిని బీట్ చేస్తూ ముందుకు వెళ్లగలిగే కెపాసిటి రామ్ చరణ్ కి ఉందని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
Also Read : రామ్ చరణ్, బుచ్చి బాబు సినిమాకు విచిత్రమైన టైటిల్..కంగుతిన్న అభిమానులు..ఇదేమి పిచ్చి సామీ!