https://oktelugu.com/

మహేష్ రికార్డ్ బ్రేక్ చేసిన చరణ్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ రిలీజ్ కాకముందే కొత్త రికార్డ్స్ ను సెట్ చేస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ చరణ్ కి ఫస్ట్ లుక్ వీడియోతో సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భీమ్ ఫర్ రామరాజు అంటూ వచ్చిన […]

Written By:
  • admin
  • , Updated On : October 4, 2020 / 07:33 PM IST
    Follow us on


    యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ రిలీజ్ కాకముందే కొత్త రికార్డ్స్ ను సెట్ చేస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ చరణ్ కి ఫస్ట్ లుక్ వీడియోతో సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భీమ్ ఫర్ రామరాజు అంటూ వచ్చిన ఆ వీడియోలో.. చరణ్ పాత్రధారి ‘అల్లూరి’ గురించి గ్రాండ్ ఎలివేషన్స్ షాట్స్ అండ్ భారీ విజువల్స్ అలాగే చరణ్ యాక్షన్ స్టంట్స్ బాగా ఆకట్టుకున్నాయి. దీనికితోడు ఎన్టీఆర్ తన అద్భుత వాక్చాతుర్యంతో పలికిన డైలాగ్స్ అదిరిపోయాయి. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ వీడియోతో ఫ్యాన్స్ ఆసక్తిని ఇంకా డబుల్ రెట్టింపు అయింది.

    Also Read: బతికి ఉండగానే హీరోయిన్ ను చంపేశారు !

    అలా ఈ వీడియోకి భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చింది. ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ అంతే అద్భుత ప్రశంసలు దక్కాయి. అయితే తాజాగా ఈ ఫస్ట్ లుక్ వీడియో టాలీవుడ్ లోనే అత్యధికంగా లైక్ చెయ్యబడిన టీజర్ గా ఆల్ టైం రికార్డును సెట్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ నటించిన భారీ హిట్ చిత్రం “భరత్ అనే నేను” టీజర్ పేరిట ఉన్న 6 లక్షల 63 వేల రికార్డును ఈ ఫస్ట్ లుక్ వీడియో వెయ్యి లైక్స్ తో క్రాస్ చేసి ఆ రికార్డును తన పేరిట రాసుకుంది. కాగా రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు.

    అలాగే ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటులు.. ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, అలాగే లేడి విలన్ గా ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నా.. ఇప్పుడు వారు షూట్ కి రావడం కష్టంఅయిపొయింది. విదేశి నటీనటుల వల్ల కూడా ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. ఆమెకు సంబంధించిన సీన్స్ ను ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించాడు. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.