Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఆయన కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆయనకంటూ సపరేట్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక రెండో సినిమా ఆయన ‘మగధీర’ తో ఇండస్ట్రీ హిట్ ను సాధించి మెగా పవర్ స్టార్ గా అవతరించాడు. ప్రస్తుతం ‘గ్లోబల్ స్టార్’ గా మారిన ఆయన భారీ సక్సెస్ లను అందుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు…
మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ (Ram Charan)… ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పుడు ఆయన బుచ్చిబాబు (Buchhi Babu) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈనెల 27వ తేదీన రామ్ చరణ్ బర్త్ డే ఉన్న సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో మెగా అభిమానులు కొంతవరకు నిరాశ చెందారు. అందుకే ఇప్పుడు రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను భారీగా జరుపుకోవడానికి బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేసి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఒక జోష్ నింపాలనే ఉద్దేశ్యంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ప్రైవేట్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై రామ్ చరణ్ అమ్మమ్మ..!
అందుకే ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ వస్తే మాత్రం సగటు ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అనే విషయాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి ఒక ప్రణాళికను రూపొందించినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
లేకపోతే మాత్రం తన మార్కెట్ భారీగా డౌన్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన సాధించిన విజయాలు చాలా అద్భుతమనే చెప్పాలి. ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించిన ఆయన ఈ సినిమాతో కొంతవరకు వెనుకబడ్డాడు. మరి తన మార్కెట్ ని మరింత పుంజుకోవడానికి ఇప్పుడు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. మరి బుచ్చిబాబు రామ్ చరణ్ కి భారీ సక్సెస్ ని అందిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం వాళ్ళందరినీ తలదన్నేలా తన నటనతో ప్రేక్షకులందరినీ తన వైపు తిప్పుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగే అన్ని క్వాలిటీస్ తనకు ఉన్నాయని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు…
Also Read : రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ గ్లింప్స్ వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!