spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan Birthday Surprise: రామ్ చరణ్ పుట్టినరోజుకి 'పెద్ది' నుండి భారీ సర్ప్రైజ్.. ఫ్యాన్స్...

Ram Charan Birthday Surprise: రామ్ చరణ్ పుట్టినరోజుకి ‘పెద్ది’ నుండి భారీ సర్ప్రైజ్.. ఫ్యాన్స్ కి పూనకాలే ఇక!

Ram Charan Birthday Surprise: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం కోసం అభిమానులు , ప్రేక్షకులు ఎంత ఆత్రుతతో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా నుండి ఏ చిన్న కంటెంట్ బయటకు వచ్చినా ఒక రేంజ్ లో పేలుతుంది. దీనిని బట్టీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది చెప్పేయొచ్చు. ఒక సినిమా సూపర్ హిట్ అవుతుందో లేదో అనేది, ఈమధ్య కాలం లో ప్రీ రిలీజ్ కి ముందు మేకర్స్ విడుదల చేసే కంటెంట్ ని బట్టే ఉంటుంది. వచ్చే నెల 30 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27 న విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి క గ్లింప్స్ వీడియో వచ్చింది.

Also Read: టోర్నీకి ముందే చెన్నై పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి.. ఎవరు కాపాడుతారు?

ఈ గ్లింప్స్ వీడియో లో రామ్ చరణ్ క్రికెట్ విశ్వరూపం చూసారు. ఈ నెల 27 న విడుదల చేయబోతున్న టీజర్ లో రామ్ చరణ్ కుస్తీ ఫైట్ ని చూస్తారట. 1 నిమిషం 40 సెకండ్స్ నిడివి ఉన్న టీజర్ అట. ఈ టీజర్ తో సినిమా పై ఉన్న అంచనాలు పదింతలు రెట్టింపు అవుతాయని టాక్. ఇదే రోజున ఓవర్సీస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టబోతున్నారు అట. దీనిపై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ప్రతీ ఒక్కరు కచ్చితంగా ఈ సినిమాకు నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి 3 మిలియన్ డాలర్స్ వస్తాయని ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ కి 3 మిలియన్ డాలర్స్ గ్రాస్ వసూళ్లను రాబట్టిన హీరోలు పవన్ కళ్యాణ్ , ప్రభాస్, అల్లు అర్జున్ మాత్రమే. ఇప్పుడు ‘పెద్ది’ తో రామ్ చరణ్ కూడా ఆ జాబితాలోకి చేరుతాడని ఆశిస్తున్నారు మేకర్స్.

అయితే కొంతమంది మాత్రం ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ ని జరుపుతున్నారు. ఇది పూర్తి అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి , ఏప్రిల్ 30 న ఎట్టి పరిస్థితిలోను విడుదల చెయ్యాలని చూస్తున్నారట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ షూటింగ్ తో పాటు సమాంతరంగా సరైన సమయానికే జరుగుతుంది కానీ, VFX వర్క్ మాత్రం చాలా వరకు బ్యాలన్స్ ఉందట. అవి ఆన్ టైం డెలివరీ అయితే కచ్చితంగా ఈ చిత్రం ఏప్రిల్ 30 న విడుదల అవుతుందని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular