
ఓ పక్క దేశమంతా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు చూద్దామని అందరూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే ‘ఆర్ఆర్ఆర్’ టీం సభ్యులు మాత్రం ఆ టెన్షన్ లు ఏమీ పడకుండా కడుపులో చల్ల కదలకుండా హాయిగా తీరికగా షూటింగ్ చేసుకుంటూ కాలక్షేపానికి పిట్టగోడపై ముచ్చట్లు చెప్పుకుంటూ సేదతీరుతున్నాడు. చూస్తుంటే వీరికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల చేయాలని.. త్వరగా కంప్లీట్ చేసి చూపించాలన్న తొందర లేనట్టు కనిపిస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ టీం షూటింగ్ ను కూడా తెగ ఎంజాయ్ చేస్తోందని అర్థమవుతోంది. హాయిగా ఖాళీ టైంలో సినిమా సెట్లో కాలక్షేపం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ ముగ్గురు షూటింగ్ మధ్యలో దొరికిన ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. సరదాగా గడిపారు. రాంచరణ్, ఎన్టీఆర్ పిట్టగోడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా.. ఆ దృశ్యాలను రాజమౌళి ఒక డమ్మీ కెమెరాతో చిత్రీకరిస్తున్నట్టు కనిపించాడు. ఆ వీడియోను ఆర్ఆర్ఆర్ టీం పంచుకోగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో దగ్గరి నుంచి చూస్తే ఎన్టీఆర్ మొహంపై ఏదో గాయమైనట్టుగా తెలుస్తోంది. అభిమానులు ఈ ఫొటోలు చూసి కాస్త కంగారు పడుతున్నారు. అయితే వారి నవ్వులు చూసి ఇదేదో కథలో షూటింగ్ లో భాగం కావచ్చని భావిస్తున్నారు.
https://twitter.com/RRRMovie/status/1423983359252865030?s=20