Ram Charan And Sandeep Reddy Vanga: చిరుత సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్… మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకొచ్చాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఇక అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతుండటం విశేషం… ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ సంవత్సరం మార్చి నెలలో రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. గత సంవత్సరం సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నా రామ్ చరణ్ ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…
రామ్ చరణ్ లాంటి నటుడు ఇకమీదట చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుతం ఆయన ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోల్లో ఒకడిగా ఎదిగాడు. కాబట్టి నెంబర్ వన్ పొజిషన్ ని అందుకోవాలంటే వరుస సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది…
బోల్డ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తే బాగుంటుంది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సినిమా వస్తే బాగుంటుందని సందీప్ ఆ జానర్ లో అద్భుతం గా సినిమా తీయగలడు అంటు పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…
రామ్ చరణ్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు సినిమా చేయలేదు. కాబట్టి తనకి కూడా అది చాలా కొత్తగా ఉంటుందని రామ్ చరణ్ కూడా భావిస్తున్నాడట. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ గతంలో అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే లేదు…