Acharya Trailer Review: ‘ఆచార్య’ ట్రైలర్ ప్రస్తుతం మెగా అభిమానులకు ఫుల్ కిక్ ను ఇస్తోంది. ఈ ట్రైలర్ లో భారీ విజువల్స్, అలాగే చరణ్ – చిరు మీద ఎమోషనల్ సీన్స్ కి సంబంధించిన మెయిన్ షాట్స్ , ముఖ్యంగా మెగాస్టార్ ఎలివేషన్ షాట్స్.. ఇక దేవాలయాల నేపథ్యంలో చిరు చెప్పే డైలాగ్, అదే విధంగా చిరు – చరణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించినప్పుడు ఇద్దరి మధ్య ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయాయి.
ట్రైలర్ లో డైలాగ్స్ కూడా బాగా పేలాయి. ‘ఇక్కడ అందరూ సౌమ్యులు..పూజలు, పురస్కరాలు చేసుకుంటూ.. కష్టాలొచ్చినపుడు అమ్మోరు తల్లి మీద భారమేసి.. బిక్కుబిక్కుమని ఉంటామేమోనని పొరబడి ఉండొచ్చు. ఆపదొస్తే ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది ’ అంటూ రామ్ చరణ్.. ఈ సినిమాలోని మెయిన్ ఎమోషన్ని డైలాగ్ రూపంలో చెప్పడం బాగుంది.
Also Read: Hero Yash: యష్ లైఫ్ లో జరిగిన విశేషాలు.. రూ.300తో పారిపోయి వచ్చి.. ఎన్ని బాధలు పడ్డాడో..
అదే విధంగా ‘ధర్మస్థలి అధర్మస్థలి ఎలా అవుతుంది’ అంటూ యాక్షన్ చేస్తూ చరణ్ చెప్పే డైలాగ్ కూడా సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఐతే.. ట్రైలర్ లో మెయిన్ హైలైట్ మాత్రం మెగాస్టార్ ఎంట్రీ షాట్స్. ‘పాదఘట్టం వాళ్ల గుండెల మీద కాలేస్తే ఆ కాలు తీసేయాలట. కాకపోతే అది ఏ కాలా అని..? అంటూ చిరు చేసే ఫైట్ కూడా అద్భుతంగా ఉంది.
‘నేనొచ్చానని చెప్పాలనుకున్నా.. కానీ చేయడం మొదలుపెడితే..’ అని విలన్ తో మెగాస్టార్ చెప్పిన మాస్ డైలాగ్ కూడా ప్రేక్షకుల్లో సినిమా పై అంచనాలను పెంచింది. ట్రైలర్ చివర్లో ‘నీకు సిద్దా తెలుసా ?’ అంటూ తనికెళ్ల భరణి షాక్ అవుతూ అడిగినప్పుడు.. చిరు ఎమోషనల్ రియాక్షన్ కూడా మనసుకు హత్తుకుంటుంది.
ఆ రియాక్షన్ పై ‘కామ్రేడ్ సిద్ధ’ అంటూ చిరు అరవడం, చరణ్ జంప్ చేస్తూ మెగాస్టార్ చేయి పై పాదం మోపి చిరుతలా విలన్ పై ఎటాక్ చేయడం.. అలాగే చిరు – చరణ్ కాంబినేషన్ షాట్స్ ఈ ట్రైలర్ మొత్తానికే ప్రత్యేక ఆకర్షణ. మొత్తంగా ఈ ట్రైలర్ ను ఆధ్యాత్మికంకు నక్సలిజాన్ని మిక్స్ చేసి కొరటాల శివ బాగా కట్ చేశాడు.
పైగా కామ్రేడ్స్ గెటప్స్ లో చిరంజీవి, చరణ్ లను చాలా బాగా చూపించాడు. ట్రైలర్ ఓపెనింగ్ లో కూడా ‘దివ్య వనం ఒకవైపు.. తీర్ధ జలం ఒకవైపు.. నడుమ పాద ఘట్టం’ అంటూ రామ్ చరణ్ వాయిస్‌తో ఈ సినిమా ట్రైలర్ స్టార్ట్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంది.
Also Read:Katrina Kaif: తల్లిని చేశారు సరే.. మరి సినిమాల మాటేమిటి ?