Rakul Preeth Singh : యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) ముందు వరుసలో ఉంటుంది. గత దశాబ్దం లో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసింది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం తో సూపర్ హిట్ ని అందుకొని మన తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన రకుల్ ప్రీత్, ఆ తర్వాత ఎలా అవకాశాలు తన బుట్టలో వేసుకుందో, ఎలా స్టార్ హీరోయిన్ గా ఎదిగిందో మనమంతా చూసాము. ఒక్క పవన్ కళ్యాణ్, ప్రభాస్ తో తప్ప, టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి ఈమె సినిమాలు చేసేసింది. తమిళంలో కూడా పలు సూపర్ హిట్ సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించింది. సౌత్ లో ఫేమ్ వచ్చిన తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్, ప్రస్తుతం అక్కడే ఎక్కువగా సినిమాలు చేస్తుంది.
ఇకపోతే ఈమె గత ఏడాది జాకీ భగ్నానీ(Jocky Bhagnani) అనే అతన్ని ఫిబ్రవరి 21 న పెళ్లాడింది. మరో రెండు రోజుల్లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకొని ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా, ఇటీవల రకుల్ ప్రీత్ ఒక ఇంటర్వ్యూ లో తన పెళ్లి జ్ఞాపకాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘సింపుల్ గా పెళ్లి చేసుకోవడంలో ఉండే సుఖం ఇందులో ఉండదు. నేను లగ్జరీ గా పెళ్లి చేసుకోవడం కంటే, సౌకర్యం గా పెళ్లి చేసుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను. నా పెళ్లి వేడుకలో ప్రతీ క్షణాన్ని నేను ఎంతో మనస్ఫూర్తిగా ఆస్వాదించాను. మాతో పాటు పెళ్ళికి వచ్చిన అతిథులు కూడా ఈ మధురమైన క్షణాలను ఆస్వాదించాలని అనుకున్నాం. అందుకే నో ఫోన్ పాలసీ ని తీసుకొచ్చాము. అతిథులు మా మాటలకు గౌరవం ఇచ్చి ఒక్కరు కూడా ఫోన్ తీసుకొని రాలేదు. వాళ్ళేదో ఫోటోలు తీసి సోషల్ మీడియా లో పెట్టేస్తారేమో అని ఈ పాలసీ పెట్టలేదు. కేవలం ఆ మధురమైన క్షణాలను ఎంజాయ్ చేస్తారని అలా చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇది ఇలా ఉండగా ఒకప్పుడు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ క్షణ కాలం తీరిక లేకుండా గడిపిన రకుల్ ప్రీత్ సింగ్, ఈమధ్య కాలంలో ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకోలేదు. ప్రస్తుతం హిందీ లో ఈమె అర్జున్ కపూర్(Arjun Kapoor) తో కలిసి ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ తో పాటు భూమిక పెడ్నేకర్ కూడా హీరోయిన్ గా నటించింది. ఈ నెల 21 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు ఆమె ‘రామాయణం’ లో కూడా నటిస్తుంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రావణాసురిడిగా యాష్ నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ సూర్పనక్క పాత్ర పోషిస్తుంది.