Rakul Preet Singh: మన టాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని , దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి , అతి తక్కువ కాలం లోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఈమధ్య కాలంలో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఒకటి రెండు హిట్లు అయితే వచ్చాయి కానీ , ఈమెకు సౌత్ ఇండియా లో దక్కినంత గుర్తింపు , క్రేజ్ మాత్రం బాలీవుడ్ లో దక్కడం లేదు. ఆమె రేంజ్ ఏ స్థాయికి పడిపోయిందంటే, బాలీవుడ్ లో నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ లో సూర్పనక్క అనే క్యారెక్టర్ చేసే స్థాయికి పడిపోయింది. అదే సినిమాలో ఈమెకంటే జూనియర్ గా పిలవబడే సాయి పల్లవి సీత గా నటిస్తోంది.
నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి మెయిన్ హీరోయిన్ గా నటించే సినిమాలో, సూర్పనక్క లాంటి విలన్ క్యారెక్టర్ చేసే స్థాయికి పడిపోవడం రకుల్ ప్రీత్ దురదృష్టమే. తనకు బాలీవుడ్ లో సరైన గుర్తింపు దక్కలేదనే బాధనో ఏమో తెలియదు కానీ , రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో టాలీవుడ్ ని పొగుడుతూ , బాలీవుడ్ ని తక్కువ చేసి మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ ‘బాలీవుడ్ తో పోలీస్తే , టాలీవుడ్ మేకర్స్ ఎంతో ఐకమత్యం గా ఉంటారు. బాలీవుడ్ లో విపరీతమైన పోటీ ఉంటుంది, ప్రతీ ఒక్కరిలోనూ అభద్రతాభావం ఉంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒకరి కోసం ఒకరు నిలబడడం , మద్దతు ఇచ్చుకోవడం వంటివి ఉండవు. తమ పీఆర్ లతో తోటి హీరో / హీరోయిన్ లపై నెగెటివ్ కథనాలు ప్రచారం చేయిస్తుంటారు. టాలీవుడ్ లో కూడా విపరీతంగా పోటీ వాతావరణం ఉంటుంది. కానీ అక్కడ బాలీవుడ్ తరహా లో ఎవరికీ కూడా అభద్రతాభావం ఉండదు, ఒకరిని ఒకరు సపోర్టు చేసుకుంటూ ఉంటారు , చాలా స్పోర్టివ్ గా ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు.
బాలీవుడ్ కి వెళ్తే కానీ , టాలీవుడ్ విలువ తెలియలేదా?, ఇప్పటికైనా తెలిసింది సంతోషం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రకుల్ ఎప్పుడు కూడా మన టాలీవుడ్ ని తక్కువ చేయలేదు. ఆమెకు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ రావడంతో టాలీవుడ్ దర్శకులే ఆమెని దూరం పెట్టారు. ఆమె చివరిసారిగా మన తెలుగు తెరపై కనిపించిన చిత్రం ‘కొండపొలం’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ తర్వాత ఈమె ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిమితమైంది. కనీసం ఇప్పటికైనా ఈమెను టాలీవుడ్ గుర్తిస్తుందో లేదో చూడాలి.
