Rakul Preet Singh : సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల లీగ్ లోకి అడుగుపెట్టిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). కేవలం ఒకే ఒక్క సినిమాతో ఈమె ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా సౌత్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందరితో సినిమాలు చేస్తూ, సూపర్ హిట్స్ ని అందుకుంటూ దాదాపుగా నెంబర్ 1 హీరోయిన్ల రేసులోకి అడుగుపెట్టింది. అలా కెరీర్ మంచి ఊపు మీద వెళ్తున్న సమయంలో ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చాయి. ఎప్పుడైతే ఆ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిందో రకుల్ ప్రీత్ సింగ్ జాతకం మారిపోయింది. ఒకటి రెండు హిట్ సినిమాలు చేసినప్పటికీ, ఎక్కువ శాతం డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలే ఎదురయ్యాయి. దానికి తోడు కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సత్తా చూపించడంతో ఈమెని దర్శక నిర్మాతలు మర్చిపోయారు.
Also Read : సీనియర్ ఎన్టీఆర్ దానం చేసిన పేరు కథ.. ఓ పవర్ ఫుల్ స్టార్ హీరో ఆవిర్భావం…
మరోపక్క ఈ ఈమధ్య కాలం లో రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లో కంటే సోషల్ మీడియా లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అప్లోడ్ చేస్తూ అభిమానులతో నిత్యం ఇంటరాక్షన్ లో ఉంటుంది. ఇకపోతే ఈమె గత ఏడాది ఫిబ్రవరి నెలలో జాకీ భగ్నానీ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈమె రీసెంట్ గా అబార్షన్ అనే టాపిక్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొంతమంది అబార్షన్ చేయించుకోమని చాలా తేలికగా చెప్పేస్తూ ఉంటారు, కానీ ఆడవాళ్ళకు అది ఎంత కష్టంగా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. స్కిల్ లాయర్ పిల్ చేస్తేనే భరించలేనంత నొప్పి ఉంటుంది. అలాంటిది ఒక శరీరం నుండి మరో ప్రాణాన్ని వేరు చెయ్యడమంటే ఎంతటి మానసిక, శారీరక క్షోభ ఉంటుందో ఊహించుకోగలరా?’.
‘సైన్స్ ప్రకారం శరీరం కేవలం రెండు మిస్ క్యారేజిలను మాత్రమే భరించగలదు. కానీ ప్రతీ 5 మంది మహిళలో ఇద్దరు మహిళలు మూడు నుండి ఐదు అబార్షన్స్ ని పొందుతున్నారు’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఒక్క టాలీవుడ్ చిత్రం కూడా లేదు. ఈమె చివరిసారిగా కనిపించిన తెలుగు చిత్రం కొండపొలం. ఈ సినిమా కూడా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. ఇక ఆ తర్వాత రకుల్ ప్రీత్ కి తెలుగు లో అవకాశాలు కరువు అయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆమె హిందీ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ లో సూర్పనక్క క్యారక్టర్ లో నటిస్తుంది. కెరీర్ లో మొట్టమొదటి సారి విలన్ రోల్ లో కనిపించబోతుండడంతో, ఇక మీదట ఆమె అలాంటి క్యారెక్టర్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపించబోతుందా అనే సందేహాలు ఆమె అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి’.