https://oktelugu.com/

Rakul Preet Singh: గోవా బీచ్ లో రకుల్ ప్రీత్ సింగ్ నాటీ ఫోజులు… టెంప్టింగ్ లుక్ వైరల్

రకుల్ ప్రీత్ ఆల్మోస్ట్ టాలీవుడ్ కి దూరమైంది. తెలుగులో ఆమె స్టార్ హీరోయిన్ హోదా అనుభవించింది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో రకుల్ బ్రేక్ వచ్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : December 24, 2023 / 01:38 PM IST

    Rakul Preet Singh

    Follow us on

    Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ వెకేషన్ లో ఉన్నారు. ఆమె గోవా వెళ్లినట్లు తెలుస్తుంది. ఓ మ్యారేజ్ వేడుక కోసం బీచ్ సిటీకి వెళ్లారు. రకుల్ ప్రీత్ తో ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మి వంటి సెలెబ్స్ జాయిన్ అయ్యారు. ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కాగా… కలిసి గోవా వెల్లడమైంది. గోవాలో వారి దినచర్యను ఫోటోలు, వీడియోల రూపంలో ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ ట్రెండీ అవుట్ ఫిట్ లో సూపర్ హాట్ గా దర్శనం ఇచ్చింది. ఆమె లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.

    కాగా రకుల్ ప్రీత్ ఆల్మోస్ట్ టాలీవుడ్ కి దూరమైంది. తెలుగులో ఆమె స్టార్ హీరోయిన్ హోదా అనుభవించింది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో రకుల్ బ్రేక్ వచ్చింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టింది. బాలీవుడ్ మీద కన్నేసిన రకుల్ ప్రీత్ ముంబైకి జంప్ అయ్యింది.

    రకుల్ తెలుగులో నటించిన చివరి చిత్రం కొండపొలం. దర్శకుడు క్రిష్ తెరెక్కించాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో టాలీవుడ్ కూడా ఆమెను దూరం పెట్టేశారు. కొన్నాళ్లుగా ఆమె హిందీలో ఎక్కువ చిత్రాలు చేస్తుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా చేసుకుంటూ పోతుంది.

    కాగా రకుల్ జాకీ భగ్నానీ ని ప్రియుడిగా ప్రకటించింది. జాకీ నటుడు, నిర్మాత. బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేశాక… పెళ్లి ఎప్పుడనే చర్చ మొదలైంది. ఎక్కడికెళ్లినా రకుల్ ని మీడియా పెళ్లి మేటర్ అడుగుతున్నారు. విసిగిపోయిన రకుల్… కుదిరినప్పుడు కచ్చితంగా చెబుతాను. పెళ్లి కంటే జీవితంలో ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి, అని ఫైర్ అయ్యారు.

    2023లో రకుల్-జాకీ పెళ్లి పీటలు ఎక్కుతారనే వాదన వినిపించింది. అది జరగలేదు. ఈ క్రమంలో ఈ ప్రేమ పెళ్లి పీటల వరకు వెళుతుందా లేదా అనే సందేహం కలుగుతుంది. రకుల్ నటిస్తున్న సౌత్ ప్రాజెక్ట్ భారతీయుడు 2. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నాడు. కాజల్ మెయిన్ హీరోయిన్ కాగా రకుల్ సెకండ్ హీరోయిన్ అని సమాచారం.