
Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సడెన్ గా తన ప్రియుడి గురించి పబ్లిక్ చేసింది. రకుల్ పెళ్ళికి రెడీ అవుతుందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి. రకుల్ పెళ్లి కోసమే.. ప్రియుడు పేరును బయట పెట్టింది అంటున్నారు. ప్రస్తుతం రకుల్ వయసు 32 ఏళ్ళు. 33 లోకి అడుగుపెట్టే లోపే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుందట. అందుకే ఉన్నట్టు ఉండి బాలీవుడ్ నిర్మాత కొడుకు జాకీ భగ్నానీతో ప్రేమ బంధం గురించి పంచుకుంది .
అయితే, ఈ బంధం పెళ్లి వరకూ పోదు అని నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. రకుల్ ఇన్నేళ్ళలో పలువురి హీరోలతో పాటు కొందరు రాజకీయ నాయకులతో కూడా డేటింగ్ చేసింది. ఆ విషయాల పై అనేక పుకార్లు వచ్చినా.. రకుల్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అయితే, తన ప్రేమ వ్యవహారాల గురించి ఓపెన్ గా ఎప్పుడూ చెప్పలేదు.
పైగా తనకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు అంటూ ఇన్నాళ్లు కలర్ ఇస్తూ వచ్చింది. కాకపోతే, ఇప్పుడు జాకీ గురించి అంత బహిరంగంగా ప్రకటించడానికి ముఖ్య కారణం… జాకీ తండ్రి. ఆయన రకుల్ తో జాకీ పెళ్ళికి అంగీకరించట్లేదు అట. అందుకే తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టేస్తే.. జాకీ కుటుంబానికి, సన్నిహితులకు మ్యాటర్ అర్ధమవుతుంది.
అందుకే, రకుల్ తెలివిగా జాకీతో ప్రేమ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇప్పటివరకు రకుల్ చేసిన డేటింగ్ లు ఆమె సీరియస్ గా తీసుకోలేదు. కానీ జాకీతో పెళ్లిని మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే, పుట్టినరోజు నాడే తన ప్రియుడు ఇతనే అని ప్రకటించింది. కానీ, జాకీ పెద్దల నుంచి అంగీకారం మాత్రం రావడం లేదు.
రకుల్ ప్రీత్ సింగ్ బాధను అర్ధం చేసుకున్న తర్వాత అయినా జాకీ కుటుంబం ఆమెను తమ కోడలిగా అంగీకరిస్తోందేమో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే.. రకుల్ కి తెలుగులో కన్నా హిందీలోనే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. కానీ హిందీలో ఏడు సినిమాలు చేస్తోంది.
View this post on Instagram