Rakul Preet Singh: పరిశ్రమలో పరిచయాలు ప్రేమలు బ్రేకప్స్ వెరీ కామన్. పెళ్లి తీరం చేరే ప్రేమ కథలు చాలా తక్కువ ఉంటాయి. అవసరాల కోసం అప్పటికప్పుడు పుట్టే ప్రేమలు కూడా ఉంటాయి. కొందరైతే ఒక అగ్రిమెంట్ ప్రకారం ప్రేమించుకొని వదిలేస్తారు. బాలీవుడ్ లో ఒక్కో హీరో, హీరోయిన్స్ కనీసం రెండు మూడు ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటారు. కాగా బాలీవుడ్ కి వలస వెళ్లిన రకుల్ గత ఏడాది ప్రియుడ్ని పరిచయం చేసింది. బర్త్ డే నాడు నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు వెల్లడించింది. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

రకుల్ సడన్ గా బాయ్ ఫ్రెండ్ గురించి లీక్ చేయడం సంచలనం రేపింది. అందులోనూ రకుల్-జాకీ ప్రేమించుకుంటున్నట్లు ఎలాంటి పుకార్లు, ఊహాగానాలు కూడా రాలేదు. ఇక స్వయంగా ప్రకటించడంతో త్వరలోనే పెళ్లి అనుకున్నారందరూ. 2022 అక్టోబర్ కి రకుల్ లవ్ స్టోరీ రివీల్ చేసి సరిగ్గా ఏడాది. ఈ ఏడాది కాలం మీడియా రకుల్ ని ఒక ఆటాడుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్ కి వెళ్లినా పెళ్ళెప్పుడు అంటూ ప్రశ్నలు కురిపించేవారు. ఒకటి రెండు సందర్భాల్లో సహనంగా చెప్పిన రకుల్ ఫైర్ అయ్యారు.
జీవితంలో పెళ్లి కంటే ముఖ్యమైన విషయాలు చాలా ఉంటాయి. పెళ్లి ఎప్పుడు అనేది చెప్పను. కుదిరినప్పుడు ఖచ్చితంగా తెలియజేస్తా అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాగా ఇటీవల రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ ఓపెన్ అయ్యాడు. రకుల్, జాకీ కొంచెం బిజీగా ఉన్నారు. పెళ్లి ఆలోచనలు చేస్తున్నారు. బహుశా వచ్చే ఏడాది ఉండొచ్చు అని మీడియాకు తెలియజేశారు. అమన్ స్టేట్మెంట్ రకుల్ కి కోపం తెప్పించింది. నాకు తెలియని నా పర్సనల్ విషయాలు నువ్వు ఎలా డిసైడ్ చేస్తావ్.. అని అర్థం వచ్చేలా తమ్ముడిని ఉద్దేశిస్తూ ఓపెన్ ట్వీట్ చేసింది.

ప్రతిసారి పెళ్లంటే రకుల్ మండిపడుతుండగా కొత్త వాదన తెరపైకి వచ్చింది. జాకీ భగ్నానీకి రకుల్ హ్యాండ్ ఇచ్చారంటున్నారు. కొన్నాళ్ళు అతనితో రిలేషన్ నడిపినప్పటికీ పెళ్లి ఆలోచన లేదనే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ పుకార్లలో నిజమెంతో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తోంది. జరగని పెళ్లి గురించి పదే పదే అడుగుతున్న తరుణంలో రకుల్ అసహనానికి గురయ్యేవారట. వీరి రిలేషన్ ఒక పరస్పర అంగీకారం పై మొదలైనట్లు బాలీవుడ్ వర్గాల వాదన. మరో వైపు రకుల్ నెలల వ్యవధిలో 5 సినిమాలు విడుదల చేసింది. మరి కొన్ని చిత్రాలతో ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు.