Vijay Devarakonda- Shahrukh Khan: టాలీవుడ్ లో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు విజయ్ దేవరకొండ..పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం మరియు టాక్సీవాలా వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న విజయ్ దేవరకొండ కి గత కొంతకాలం నుండి సరైన హిట్ పడడడం లేదు..టాక్సీవాలా తర్వాత ఆయన చేసిన డియర్ కామ్రేడ్ , వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలు డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.

ఇక పాన్ ఇండియా లెవెల్ లో పూరి జగన్నాథ్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన లైగర్ చిత్రం ఇటీవలే విడుదలై ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిందో మన అందరికి తెలిసిందే..ఇలా వరుసగా మూడు డిజాస్టర్స్ వస్తే ఏ హీరో అయినా షెడ్ కి వెళ్తారు..అసలు ఆ హీరో తో సినిమాలు చెయ్యడానికి ఎవ్వరు సాహసించరు..కానీ విజయ్ దేవరకొండ రేంజ్ వేరే..ఇన్ని ఫ్లాప్స్ వచ్చిన కూడా ఆయన క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు.
టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆయనకీ క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి..లేటెస్ట్ గా ఈయనకి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ నుండి ఒక చేయాల్సిందిగా భారీ రెమ్యూనరేషన్ తో ఒక ఆఫర్ వచ్చిందట..ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఒక స్టార్ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారట..ఇంత క్రేజీ ప్రాజెక్ట్ వస్తే విజయ్ దేవరకొండ ఎందుకు వదులుకుంటారు..వెంటనే ఓకే చెప్పేసాడు..అతి త్వరలోనే ఈ సినిమా కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ తెలుగు లో శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘ఖుషి’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు..సమంత ఇందులో హీరోయిన్..ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది..క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి..విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆశిస్తున్నారు ఆయన ఫాన్స్.