https://oktelugu.com/

Rakul Preeth Singh: మరోసారి అడవి బాట పట్టనున్న రకుల్ ప్రీత్ సింగ్…

Rakul Preeth Singh: తాజాగా విడుదలైన కొండపొలం చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఈ సినిమా మొత్తం అడవిని ప్రాధాన్యంగా చేసుకొని తెరకెక్కింది. ఈ చిత్రం కోసం యూనిట్ మొత్తం అడవిలోనే 45 రోజులు షూటింగ్ పూర్తి చేసుకున్నారు. మళ్లీ అడవిలో షూటింగ్ కి వెళుతుంది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం […]

Written By: , Updated On : October 21, 2021 / 03:15 PM IST
Follow us on

Rakul Preeth Singh: తాజాగా విడుదలైన కొండపొలం చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఈ సినిమా మొత్తం అడవిని ప్రాధాన్యంగా చేసుకొని తెరకెక్కింది. ఈ చిత్రం కోసం యూనిట్ మొత్తం అడవిలోనే 45 రోజులు షూటింగ్ పూర్తి చేసుకున్నారు. మళ్లీ అడవిలో షూటింగ్ కి వెళుతుంది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.

rakul again accepts forest backdrop movie in bollywood

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తెలుగులో కన్నా బాలీవుడ్ లో కొత్త ప్రాజెక్ట్ లు ఎక్కువగా ఉన్నాయి. అటాక్, మేడ్, థాంక్యూ గాడ్,  డాక్టర్ జి, ఛత్ రీవాలీ వంటి చిత్రాలలో నటించనున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ అశుతోష్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.

అశుతోష్ హిస్టారికల్ మూవీల నిర్మించడంలో తనను మించిన వారు ఉండరు. జోధా అక్బర్,  మొహంజోదారో, పానిపట్, లాంటి అద్భుతమైన చిత్రాలను తనదైన శైలిలో ప్రేక్షకులకు చరిత్రను చూపించారు.  ఫర్హాన్ అఖ్తర్‌‌ సరసన రకుల్‌ హీరోయిన్ గా  ‘ పుకార్ ’ అనే సినిమా చేయనుంది. ఈ చిత్రం అడవి నేపథ్యంలో ఉంటుందని… ఫర్హాన్ ఫారెస్ట్ ఆఫీసర్‌‌గా కనిపిస్తాడని టాక్ నడుస్తుంది. అడవిని, అటవీ సంపదను కాపాడటానికి అతను పడే తపనే ఈ సినిమా నేపథ్యం.

కాగా ఈ సినిమాలో విలన్‌గా జగపతిబాబు సెలెక్ట్ చేసుకున్నాడట అశుతోష్. దీంతో విలన్‌గా బాలీవుడ్ లో కూడా  ఎంట్రీ ఇవ్వనున్నారు జగపతిబాబు. ” పుకార్ ” చిత్రం డిసెంబర్ లో షూటింగ్ కి వెళ్లనున్నది. ‘ఛత్‌రీ వాలీ’ సినిమాని పూర్తి చేసిన తర్వాత రకుల్‌ ఈ మూవీ షూట్‌లో జాయినవుతుంది. బీటౌన్‌లో రకుల్ జర్నీ ఎలా ఉండబోతుందో అని ఆమె అభిమానులిఉ ఎదురుచూస్తున్నారు.