https://oktelugu.com/

Rakesh Master Son: మా నాన్న చావుకు కారణం వాళ్లే, కేసు పెడతా… రాకేష్ మాస్టర్ కొడుకు సంచలనం!

రాకేష్ మాస్టర్ కొడుకు చరణ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తిరుపతిలో పుట్టిన రాకేష్ మాస్టర్ గొప్ప డాన్స్ మాస్టర్ గా ఎదిగాడు. హైదరాబాద్ కి వచ్చి డాన్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడు. ప్రభాస్, వేణు తొట్టెంపూడితో పాటు పలువురు ఆయన వద్ద డాన్స్ నేర్చుకున్నారు.

Written By:
  • Shiva
  • , Updated On : June 23, 2023 / 09:31 AM IST

    Rakesh Master Son

    Follow us on

    Rakesh Master Son: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో రాకేష్ మాస్టర్ ఎందరో డాన్స్ మాస్టర్స్ ని తయారు చేశాడు. వారిలో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వంటి స్టార్స్ కూడా ఉన్నారు. ముక్కుసూటిగా ఉండే రాకేష్ మాస్టర్ పరిశ్రమలో ఇమడలేకపోయారు. వివాదాలతో కెరీర్ లో ఎదగలేకపోయాడు. ఒక దశకు వచ్చాక రాకేష్ మాస్టర్ సోషల్ మీడియా సెలబ్రిటీ గా మారిపోయాడు.

    ఇండస్ట్రీ ప్రముఖులను తిడుతూ, వాళ్ళ లోపాలు ఎత్తి చూపుతూ వీడియోలు చేశాడు. నాకు నచ్చినట్లుగా బ్రతుకుతా అంటూ రకరకాల వీడియోలు షేర్ చేసేవాడు. గొప్ప టాలెంట్ ఉన్న రాకేష్ మాస్టర్ సరైన గుర్తింపుకు నోచుకోకుండానే లోకాన్ని వీడిపోయారు. కాగా రాకేష్ మాస్టర్ కొడుకు చరణ్ తండ్రి మరణంపై ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి చావుకు సోషల్ మీడియానే కారణం అంటూ ఫైర్ అయ్యారు.

    అనేక యూట్యూబ్ ఛానల్స్ తమ లబ్ధి కోసం ఆయన్ని వాడుకున్నాయి. మళ్ళీ అవే యూట్యూబ్ ఛానల్ మా నాన్న మీద నెగిటివ్ ప్రచారం చేశాయి. ఇకపై రాకేష్ మాస్టర్ వీడియోలు ప్రసారం చేయకండి. మా కుటుంబానికి సంబంధించిన విషయాలు బయట పెట్టొద్దు. ఇప్పటి వరకు నవ్వులపాలు చేసింది చాలు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండని, చరణ్ అన్నాడు. సోషల్ మీడియాలో మా ఫ్యామిలీ గురించి వీడియోలు ఆపకపోతే పోలీస్ కేసు పెడతానని హెచ్చరించారు.

    రాకేష్ మాస్టర్ కొడుకు చరణ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తిరుపతిలో పుట్టిన రాకేష్ మాస్టర్ గొప్ప డాన్స్ మాస్టర్ గా ఎదిగాడు. హైదరాబాద్ కి వచ్చి డాన్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడు. ప్రభాస్, వేణు తొట్టెంపూడితో పాటు పలువురు ఆయన వద్ద డాన్స్ నేర్చుకున్నారు. వేల మంది శిష్యులు రాకేష్ మాస్టర్ కి ఉన్నారు. కెరీర్ బిగినింగ్ లో కొన్ని సూపర్ హిట్ చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా పని చేశాడు.