Adipurush Collections: ‘ఆదిపురుష్’ మొదటి వారం వసూళ్లు..సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకోవాలంటే ఇంకా ఎన్ని వందల కోట్లు రాబట్టాలో తెలుసా!

అందుతున్న ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం, ఈ సినిమాకి ఇప్పటి వరకు 320 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీనిని షేర్ కి లెక్క గడితే 160 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ఇక ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 250 కోట్ల రూపాయలకు జరిగింది.

Written By: Vicky, Updated On : June 23, 2023 9:31 am

Adipurush Collections

Follow us on

Adipurush Collections: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ చిత్రం రీసెంట్ గానే విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ రామాయణం లాంటి పురాణం గాథని వెండితెర మీద ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ని పెట్టి, 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించడం తో ఈ సినిమాపై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో విడుదలకు ముందే కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపొయ్యే విధంగా జరిగింది. ఆ కారణం చేత మొదటి మూడు రోజులు ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ మూడు రోజులు సగటు ప్రేక్షకుడికి టికెట్స్ దొరకడం చాలా కష్టం అయ్యింది. ఆ తర్వాత నాల్గవ రోజు నుండి ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఇప్పటికీ ఈ చిత్రం విడుదలై వారం రోజులు కాగా, ఈ వారం రోజులకు ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.

అందుతున్న ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం, ఈ సినిమాకి ఇప్పటి వరకు 320 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీనిని షేర్ కి లెక్క గడితే 160 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ఇక ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 250 కోట్ల రూపాయలకు జరిగింది.

ఇప్పుడు ఇది బ్రేక్ ఈవెన్ అవ్వడాలంటే దాదాపుగా మరో 90 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యాలి. అది దాదాపుగా అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఈ వీకెండ్ లో ఈ సినిమాకి అదనంగా మరో 10 కోట్ల రూపాయిల షేర్ వచ్చే అవకాశం ఉంది కానీ, బ్రేక్ ఈవెన్ పై ఆశలు వదిలేసుకోవాల్సిందే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తానికి ప్రభాస్ కి ఇది బాహుబలి సిరీస్ తర్వాత వరుసగా మూడవ డిజాస్టర్ ఫ్లాప్ చిత్రం గా మిగిలింది.