https://oktelugu.com/

Rakesh Master: చనిపోయాక నన్ను అక్కడ సమాధి చెయ్యండి : రాకేష్ మాస్టర్ చివరి మాటలు

అయితే గతం లో ఆయన ఢీ వేదిక పై చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి ట్రెండ్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ 'నేను ఆకలితో సావాసం చేశాను, నాతో పాటు చాలా మంది ప్రయాణించారు, కొంతమంది మధ్యలోనే వదిలి వెళ్లిపోయారు, నీ మాస్టర్ ని నమ్మితే నీ జీవితం మాడిపోయిన మసాలా దోశలాగా అయిపోతుందని శేఖర్ కి చాలా మంది చెప్పారు. కానీ వాడు నన్ను వదలలేదు, నాతో పాటే ప్రయాణం చేసాడు' అంటూ రాకేష్ మాస్టర్ గతం ఎమోషనల్ గా చెప్పిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Written By:
  • Vicky
  • , Updated On : June 19, 2023 / 10:44 AM IST

    Rakesh Master- Shekhar Master

    Follow us on

    Rakesh Master- Shekhar Master: ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ చనిపోయాడు అనే వార్త యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడు హుషారు గా ఉంటూ అందరికీ తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందించే రాకేష్ మాస్టర్ అకస్మాత్తుగా ఇలా చనిపోయాడు అనే వార్త రావడం తో ఇప్పటికీ చాలామంది ఇది నిజమా అని నమ్మలేని పరిస్థితి ఎదురైంది.

    ఎందుకంటే ఆయన వారం రోజులు క్రితం కూడా ఉత్తరాంధ్ర లో యూట్యూబ్ ఛానల్ కోసం ఒక స్పెషల్ ప్రోగ్రాం చెయ్యడం కొరకు వెళ్లి, అక్కడ మంచి ఎంజాయ్ మూడ్ లో ఉండడాన్ని అందరూ గమనించారు. ఆ వీడియోలు సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయ్యాయి, మీమెర్స్ కూడా ఆ వీడియోస్ ని సందర్భానికి తగ్గట్టుగా తెగ వాడేస్తున్నారు. అంత ఎంజాయ్ మోడ్ లో ఉన్న రాకేష్ మాస్టర్ అకస్మాత్తుగా ఇలా చనిపోవడం పెద్ద షాక్.

    అయితే గతం లో ఆయన ఢీ వేదిక పై చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి ట్రెండ్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ ‘నేను ఆకలితో సావాసం చేశాను, నాతో పాటు చాలా మంది ప్రయాణించారు, కొంతమంది మధ్యలోనే వదిలి వెళ్లిపోయారు, నీ మాస్టర్ ని నమ్మితే నీ జీవితం మాడిపోయిన మసాలా దోశలాగా అయిపోతుందని శేఖర్ కి చాలా మంది చెప్పారు. కానీ వాడు నన్ను వదలలేదు, నాతో పాటే ప్రయాణం చేసాడు’ అంటూ రాకేష్ మాస్టర్ గతం ఎమోషనల్ గా చెప్పిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

    ఇంకా ఆయన గురించి వివరాల్లోకి వెళ్తే గతం లో ఆయన ఒక వ్యక్తి దగ్గర రెండు లక్షల రూపాయిలు అప్పు చేసాడు, ఆ అప్పు లో 30 వేల రూపాయిలు తిరిగి ఇచ్చాడట, అయితే ఆ వ్యక్తి కొన్నాళ్ళకు చనిపోయిన తర్వాత , వాళ్ళ కొడుకు వచ్చి డబ్బులు అడిగాడట, అప్పుడు రాకేష్ మాస్టర్ తన ఇంటి పాత్రలను మొత్తం అతనికి ఇచ్చేసి, మీ నాన్న ఇచ్చిన అప్పు తిరిగి ఇచ్చేసాను అని చెప్పాడట, ఈ విషయాన్నీ ఆయన శిష్యులు చెప్పారు. గతం లో ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘మా మామ్మ గారి సమాధి పక్కన ఒక వేప చెట్టు ని నాతాను, నేను చనిపోయిన తర్వాత కూడా నన్ను ఆ చెట్టు క్రిందే పాతి పెట్టమని కోరాను’ అంటూ రాకేష్ మాస్టర్ గతం లో చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా లో ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు.