Anchor Rashmi: యాంకర్ రష్మీని ఓ హీరో అల్లాడించారు. అలసిపోయాను ఇక చాలని కోరుకున్నా వదల్లేదు. తన పంతం నెగ్గించుకొని రష్మీ ప్రాణం తీశారు.నందు- రష్మీ గౌతమ్ హీరో హీరోయిన్స్ గా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ నవంబర్ 4న విడుదలవుతుంది. ఎప్పుడో రెండేళ్ల క్రితం విడుదల కావాల్సిన ఈ మూవీకి ఇప్పుడు మోక్షం కలిగింది. అనేక అవాంతరాలు దాటి థియేటర్స్లో దిగుతుంది. జనాలు ఆల్మోస్ట్ మర్చిపోయిన ఈ సినిమాను ప్రేక్షకులోకి తీసుకెళ్లాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. దీని కోసం హీరో నందు ఎంచుకున్న మార్గం రష్మీకి చుక్కలు చూపిస్తుంది.

ఆటోలో రోడ్లపై రష్మీని తిప్పుతూ వెరైటీగా ప్రచారం చేస్తున్నారు. జనాలు గుమిగూడే కూడళ్లలో ఆటో ఆపి అక్టోబర్ 4న బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదల అవుతుంది. అందరూ సినిమా చూసి ఆదరించాలని కోరుతున్నారు. రష్మీ వంటి సెలెబ్రిటీ పబ్లిక్ లోకి రావడంతో చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. రాకేష్ మాస్టర్ తో కలిసి రష్మీని వెంటేసుకొని నందు హైదరాబాద్ రోడ్లు మొత్తం తిరుగుతున్నాడు. అయితే ఈ ప్రమోషన్స్ దెబ్బకు రష్మీకి చుక్కలు కనిపిస్తున్నాయి.
ఆటోలో దుమ్ము దూళి మధ్య రోడ్ల పై తిరుగుతుంటే రష్మీ అలసిపోతున్నారట. చేసేది లేక హీరో నందుని రష్మీ వేడుకున్నారు. ఆటోలో ఏంటి ఈ అరాచకం. నేను బాగా అలసిపోయాను. ఇక నా వల్ల కాదు. నన్ను వదిలేస్తే వెళ్లిపోతానని వేడుకుంది. మనది మాస్ మూవీ ఇలానే ప్రచారం చేయాలి, కొంచెం ఓపిక పట్టమని నందు ఆమెను రిక్వెస్ట్ చేశాడు. మొత్తంగా నందు సినిమాను హిట్ చేయాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. సినిమా పూర్తి చేయడానికి మించిన కష్టం ప్రమోషన్స్ కి పడుతున్నాడు. కొత్త కొత్త ఆలోచనలతో ఆడియన్స్ ని ఆకర్షించేందుకు ట్రై చేస్తున్నాడు.

రాజ్ విరాట్ దర్శకత్వంలో బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కింది. మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె, కిరీటి కీలక రోల్స్ చేస్తున్నారు. కొద్దిరోజులు ముందు బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ప్రమోషన్స్ కి రష్మీ రావడం లేదు. మా ఫోన్స్ కి రెస్పాండ్ కావడం లేదంటూ నందు ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో నేరుగా రష్మీ షూట్ జరుగుతున్న స్టూడియోకి వెళ్లి నిలదీశారు. అది ప్రాంక్ వీడియో కాదు నిజంగానే నన్ను అటాక్ చేశారని రష్మీ చెప్పడం విశేషం.