Varanasi movie scene leak: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన ‘వారణాసి'(Varanasi Movie) టైటిల్ ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని రీసెంట్ గానే రామోజీ ఫిలిం సిటీ లో #Globetrotter ఈవెంట్ ద్వారా గ్రాండ్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ వీడియో ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎన్నో కోతరకమైన విషయాలు తెలుస్తాయి. రాజమౌళి ఈ సినిమా కాన్సెప్ట్ ని తయారు చేసేందుకు ఎంత కష్టపడ్డాడో, ఎంతో పరిశోధనలు చేసాడో అనేది ఈ గ్లింప్స్ ని చూసి చెప్పేయొచ్చు. కేవలం ఒకే ఒక్క సీక్వెన్స్ ని తెరకెక్కించడానికి దాదాపుగా 60 రోజుల సమయం తీసుకున్నారట. ఇది సాధారణమైన విషయం కాదు. ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాని 2027 శ్రీ రామ నవమి కి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఇదంతా పక్కన పెడితే ఈ మూవీ కంటెంట్ పై ఇప్పటికే సోషల్ మీడియా లో ఎన్నో ఫన్నీ మీమ్స్ రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ స్టాగ్రామ్ లో అయితే ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన మీమ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అందులో ఒక మీమ్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఈ మీమ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ బ్రతికి ఉన్న రోజుల్లో సునిశిత్ అనే వ్యక్తితో ఇంటర్వ్యూ చేసినప్పటి వీడియో కి సంబంధించినది. ముందుగా సునిశిత్ మాట్లాడుతూ ‘అదిగో హిమాలయాలు..వావ్..ఎంత బాగుందో’ అని అంటుంటాడు, అప్పుడు రాకేష్ మాస్టర్ ‘అక్కడ మహేష్ బాబు ఉంటాడు చూడు’ అని అంటాడు. దానికి సునిశిత్ ‘హా..అవును మాస్టర్..డ్యాన్స్ వేస్తున్నాడు’ అని అంటాడు. ఈ మీమ్ ని చూసి వారణాసి మూవీ లోని సన్నివేశాన్ని రాకేష్ మాస్టర్ 5 ఏళ్ళ క్రితమే లీక్ చేసాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
వివరాల్లోకి వెళ్తే ‘వారణాసి’ మూవీ గ్లింప్స్ వీడియో లో హిమాలయ పర్వతాలు చూపిస్తారు గుర్తుందా?, ఆ పర్వతాలను బాగా గమనిస్తే అందులో మహేష్ బాబు ఆ పర్వతాన్ని ఎక్కుతున్నట్టు చిన్నగా కనిపిస్తాడు. దీనిని మహేష్ వీరాభిమానులు కూడా కనిపెట్టలేకపోయారు కానీ, మీమర్స్ మాత్రం కనిపెట్టేసారు. సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారి నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఇకపోతే మహేష్ అభిమానులు కోరుకున్న దానికంటే ఎక్కువ అప్డేట్స్ ఇచ్చేసారు మేకర్స్. ఇక ఇప్పట్లో మళ్లీ కొత్త అప్డేట్ వచ్చే అవకాశం లేదు. కానీ త్వరలోనే ఈ సినిమాలో తమిళ హీరో రంగనాథన్ మాధవన్ కూడా భాగం కాబోతున్నాడని టాక్.