Rakasa Movie Review: ‘ మెగా డాటర్ నిహారిక కొణిదల ప్రొడ్యూసర్ గా చేసిన కమిట్ కుర్రాళ్ళు సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆమె రెండో ప్రయత్నంగా ‘రాకాస’ అనే సినిమా చేశారు. ఈ సినిమాలో సంగీత శోభన్ హీరోగా చేశాడు. మానస శర్మ అనే ఆవిడ దర్శకురాలిగా పరిచయం అవుతుండడం విశేషం… ఇక ఈ సినిమా రేపు రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ అయితే వేశారు. దాన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…
కథ
వీరబాబు (సంగీత్ శోభన్) అమెరికాలో సెటిలవుతాడు. తను ప్రేమించిన సుకన్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇండియా కి వస్తాడు…ఇక ఆ అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది…అప్పుడే వీరబాబు వల్లే ఒక వ్యక్తి మిస్ అయ్యాడని ఊరు మొత్తం నమ్ముతుంది. దాంతో వీరబాబుకి ఊరిలో వాళ్ళు ఎవ్వరు హెల్ప్ చేయకూడదని ఆ ఊరి పెద్ద తీర్పునిస్తాడు…
ఇక ఆ ఊరిలో ఒక బ్రాహ్మ రాక్షసుడు ఉన్నాడని వాడి కోసం కొన్ని సంవత్సరాల కొకసారి ఊరిలో ఎవరినో ఒకరిని వాడి కోట కి పంపిస్తుంటారు…ఇక ఈ విషయంలోకి వీరబాబు ఎలా ఇరుక్కున్నాడు…ఇంతకి ఆ రాక్షసుడు ఎవరు.? వీరబాబు కి రాక్షసుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? అనే విషయాలు మీకు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
దర్శకురాలు మానస శర్మ కథ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది… రాక్షసుడు ఉన్నారు అంటారు. వాడిని చూపించినప్పుడు భయం కలగలేదు. వాడిని చూసి భయపడలా లేదంటే సంగీత శోభన్ వేసే కుళ్ళు జోకులకు నవ్వుల ఏమి అర్థంకాని పరిస్థితి…నిజానికి దర్శకురాలు పూర్తిగా ఈ కథ ను హార్రర్ జానర్ లో తీస్తే బాగుండేది. అలా కాకుండా ఫస్టాఫ్ అంత సోది నడిపించారు…కామెడీ పంచులు అనుకుంటూ ఏవేవో డైలాగ్స్ చెప్పించారు…
అటు హార్రర్ సినిమాగా కాకుండా ఇటు కామెడీ సినిమా కాకుండా పోయింది…ట్రైలర్ లో భయానక సన్నివేశాలు చాలా ఉంటాయి అనేలా చూపించారు. కానీ ఇందులో ఒక్క సీన్ తో కూడా ప్రేక్షకులను బయపట్టించలేదు… చాలా సీన్స్ కి లాజిక్కులు లేవు… కథ ఇంకా బాగా రాసుకోవడానికి స్కోప్ ఉంది కానీ రాయలేదు…అసలు ఈ సినిమాలో హైలెట్ అని చెప్పుకోవడానికి ఒక్క సీన్ కూడా లేదంటే ఈ సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కించారో మనం అర్థం చేసుకోవచ్చు…
ఎమోషనల్ సన్నివేశాలు ఒక్కటి కూడా కనిపించావ్…కామెడీ అయిన బాగుందా అంటే అది కూడా లేదు… జబర్దస్త్ షో కామెడీ కూడా దీని కంటే బాగుంటుంది…ప్రమోషన్స్ చేసినంత మాత్రనా సినిమాలు ఆడవు…ప్రేక్షకులకు ఆ కంటెంట్ నచ్చాలి అప్పుడే సినిమా సగటు ప్రేక్షకుడి నుంచి ప్రశంసలను అందుకుంటుంది…ఇక ఆ రక్షల నుంచి తప్పించుకోవడానికి తాడు ను వాడతారు…దాని బ్యాక్ స్టోరీ ఏంటనేది చెప్పారు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
హీరో సంగీత శోభన్ ప్రతి సీన్ లో కామెడీ చేయడానికి ట్రై చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఆయన కామెడీ చేసేంత సీన్స్ ఏం లేవు.ఆయన ఏదో ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ప్రేక్షకుడికి మాత్రం అవేమి అర్థంకావు.ఇక హీరోయిన్ నయన సారిక పాత్ర కూడా పెద్దగా ఎఫెక్టివ్ గా లేదు…ఆమె నటన కూడా ఒకే అనిపించింది…
వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ఇద్దరు కొంత వరకు పర్లేదు అనిపించారు.రోహిణి కామెడీ చిరాకు పుట్టించింది.ఆమె నటనను చూడలేకపోయాం.బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి ఎందుకున్నారో అర్థం కాలేదు.వాళ్ల పాత్రకి నటించే స్కోప్ లేదు…తనికెళ్ళ భరణి క్యారెక్టర్ ను ఇంట్రెస్టింగ్ ఓపెన్ చేశారు…కానీ రొటీన్ గా సినిమా అంత సాగుతుంది.ఇక మిగిలిన ఆర్టిస్టులందరు ఒకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
మ్యూజిక్ పెద్దగా ప్లస్ అవ్వలేదు… హార్రర్ సినిమాలకు ఇచ్చే మ్యూజిక్ ఇదైతే కాదు… ఆర్ ఆర్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది…ఇక సినిమాటోగ్రఫీ ఉన్నంతలో ఒకే అనిపించింది… సీజీ వర్క్ అంత బాగా సెట్ అవ్వలేదు…ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంత లో ఒకే అనిపించాయి…
రాకాస అనేది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే, ఆధ్యాత్మిక కోణంతో కూడిన హారర్-కామెడీ చిత్రం. మొదటి భాగంలో కథనం పొంతన లేకుండా ఉంటుంది. అసలు కథలోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ఇందులో కామెడీ ఉన్నప్పటికీ, అది ఫర్వాలేదనిపిస్తుంది. విరామ సమయంలో అసలు కథ మొదలవుతుంది. కథలో కామెడీ కోణాన్ని చక్కగా అల్లిన తర్వాత, సినిమా ద్వితీయార్థం మెరుగ్గా ఉంటుంది. కథను ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని విషయాలు చాలా సులభంగా జరిగిపోతాయి, ఇది కొంచెం హాస్యాస్పదంగా అనిపించినా, కామెడీ దానిని అధిగమిస్తుంది. ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత, క్లైమాక్స్ కూడా చాలా సౌకర్యవంతంగా ముగించేశారు.
మొత్తం మీద మరింత ఆసక్తికరంగా సాగిన ద్వితీయార్థం , ఫర్వాలేదనిపించిన ప్రథమార్థం కారణంగా, రాక్షస ఒక్కసారి చూడదగిన ఫర్వాలేదనిపించే చిత్రంగా నిలుస్తుంది.
ఈ మూవీలో బాగున్నవి
రాక్షసుడి బ్యాక్ స్టోరీ…
ఈ మూవీలో బాగోలేనివి
కథ
స్క్రీన్ ప్లే
ఫస్టాఫ్
కామెడీ సీన్స్
రేటింగ్ : 2/5
ఫైనల్ థాట్ : రొటీన్ సినిమాలు ఇష్టపడే వాళ్లు ఈ సినిమా చూడచ్చు…
