Rakasa movie collections : ఈ నెలలో విడుదలైన సినిమాల్లో ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘రాకాస’. సంగీత్ శోభన్ , నయన్ శారికా హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించగా, నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించింది. కొత్త సినిమాలు విడుదలైనప్పటికీ కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. గడిచిన 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి 7 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఒక చిన్న సినిమాకు బుక్ మై షో లో ఇన్ని రోజులు ట్రెండింగ్ లో ఉండడం చాలా అరుదు. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ హీరో ఎవరు అనేది కూడా చూడరు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇకపోతే 11 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లు వచ్చాయో చూద్దాం.
11 వ రోజున ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 11 రోజుల్లో దాదాపుగా 4 కోట్ల 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 1 కోటి రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి 3 కోట్ల 46 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 14 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 8 కోట్ల 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి ఈ చిత్రానికి 11 రోజుల్లో 87 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.
ఇక ఓవర్సీస్ లో అయితే 2 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 22 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు 11 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ చిత్రానికి 13 కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇక కేవలం 1 కోటి 87 లక్షల రూపాయిలు మాత్రమే రావాలి అన్నమాట. వీకెండ్ లోపు ఈ మార్కుని అందుకొని, లాభాల్లోకి కూడా ఈ చిత్రం అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి అని అనుటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
