Homeఎంటర్టైన్మెంట్Biker Movie 10 Days Worldwide Collections: 'బైకర్' 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.....

Biker Movie 10 Days Worldwide Collections: ‘బైకర్’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. సూపర్ హిట్ టాక్ తో భారీ నష్టాలు..

Biker Movie 10 Days Worldwide Collections: ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని , మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన శర్వానంద్(Actor Sharwanand) , ఈ నెల 2న ‘బైకర్'(Biker Movie) మూవీ తో మరోసారి మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదటి రోజు మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఆ టాక్ కలెక్షన్స్ ని మాత్రం ఆశించిన స్థాయిలో రప్పించలేకపోయింది. ఈ సినిమాకు చాలా డీసెంట్ స్థాయి థియేట్రికల్ రన్ ఉంది , ఇప్పటికీ మంచి డీసెంట్ రన్ వస్తోంది , కానీ అది బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఏ మాత్రం కూడా సరిపోదు. విడుదలకు ముందు ఈ చిత్రానికి అక్షరాలా 22 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

10 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం , ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి దాదాపుగా 4 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అత్యధిక వసూళ్లు ఈ ప్రాంతం నుండే వచ్చాయి. అదే విధంగా సీడెడ్ + ఆంధ్ర ప్రదేశ్ నుండి ఈ చిత్రానికి 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూలు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 8 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాల నుండి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , ఓవర్సీస్ నుండి 1 కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

సాధారణంగా ఇలాంటి సినిమాలకు ఓవర్సీస్ ఆడియన్స్ మంచి వసూళ్లను అందిస్తుంటారు. కానీ ఎందుకో ఈ చిత్రానికి ఆ ప్రాంతం నుండి కనీస స్థాయి వసూళ్లు కూడా నమోదు అవ్వలేదు. ఇది నిర్మాతకు చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు 10 కోట్ల 50 లక్షల రూపాయిలు. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 18 కోట్ల 70 లక్షల రూపాయిల వరకు ఉంటుంది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ సినిమా ఇంకా 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఆ రేంజ్ షేర్ వసూళ్లను రాబట్టడం దాదాపుగా అసాధ్యం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే ఈ సినిమా కేవలం మరో 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టగలదు. విడుదలకు ముందు సరైన హైప్ ని క్రియేట్ చేయలేకపోవడం వల్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం కష్టం గా మారింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Oktelugu Epaper
Exit mobile version