Raju Weds Rambai: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. స్టార్ హీరోలు డిఫరెంట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… చిన్న సినిమాల సైతం వాటి సత్తా చాటుకొని గొప్ప విజయాలను సాధిస్తున్నాయి. ఈరోజు రిలీజ్ అవుతున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ నిన్న నైట్ నుంచే వేశారు. ప్రీమియర్స్ తోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమాను సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే..?
ఈ సినిమాలో పాటలు ప్రేక్షకులను చాలా వరకు మెప్పించాయి. దాంతో సినిమా రిలీజ్ కి ముందే ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ ను క్రియేట్ చేసింది. దానివల్ల సినిమా చూడాలనే కోరిక ప్రతి ఒక్క అభిమాని కోరుకున్నాడు. కారణం ఏదైనా కూడా మొత్తానికైతే ఈ సినిమా సక్సెస్ బాట పడటం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి… రాజు – రాంబాయి మధ్యలో వచ్చే లవ్ సీన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దర్శకుడు వీటిని చాలా సెన్సిబుల్ తో తీశాడు.
మొత్తానికైతే డీసెంట్ అటెంప్ట్ అనే చెప్పాలి. సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాలో కూడా ఇలాంటి ఒక క్లైమాక్స్ మనం చూసి ఉండము అనేంతల క్లైమాక్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసాడు… సాయిలు మొదటి సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. డైరెక్టర్ గా ఒక ట్రూ ఇన్సిడెంట్ ను తీసుకొని సినిమా చేయాలనే ఆలోచన అతనికి రావడమే చాలా గొప్ప విషయం…
ఇక అదే విషయాన్ని స్ట్రైయిట్ ఫార్వర్డ్ గా చెప్పే ప్రయత్నం కూడా చేశాడు… హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది… ఇక ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక మొత్తానికైతే ఈ సినిమా ఇప్పుడున్న యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాబట్టి ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు…