Raju Weds Rambai Movie First Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది…ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఉన్న డైరెక్టర్స్ డిఫరెంట్ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా పోటీకి వస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే లిటిల్ హార్ట్స్, ప్రీ వెడ్డింగ్ షో లాంటి రెండు సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇక అదే బాటలో ఈనెల 21వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ లో ఉన్న పెద్దలకు రీసెంట్ గా ప్రివ్యూ వేశారట. వల్ల ఒపీనియన్ ను బట్టి వాళ్లిచ్చే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది. సగటు ప్రేక్షకుడిని మెప్పించబోతుందా? లేదా అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే రాజు వెడ్స్ రాంబాయి ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ రాంబాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడుతూ తనను పెంచాడు. కాబట్టి వీళ్ళ ప్రేమకి అమ్మాయి వాళ్ల నాన్న అంగీకరించడు. దాంతో రాంబాయి అటు రాజుని వదులుకోలేక ఇటు కన్నవాళ్ళు పెట్టే ఇబ్బందులను భరించలేక పోతోంది. ఫైనల్ గా రాజు రాంబాయి ఇద్దరు ఒకటయ్యారా లేదా అనేది ఈ సినిమా చూస్తేనీ తెలుస్తోంది…
ఇక సినిమా విలీజ్ ప్రేమకథతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా వేణు ఉడుగుల ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడంతో ఈ సినిమా రేంజ్ మారిపోయింది… ఇక ఈ సినిమాలో కామెడీ చాలా హైలెట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే విజువల్స్ కూడా సినిమాకి చాలా బాగున్నాయి. సురేష్ బొబ్బిలి సాంగ్స్ కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయట… మొత్తానీకైతే ఈ సినిమాలోని కొన్ని ట్విస్టులు కూడా ప్రేక్షకులను అలరిస్తాయని తెలుస్తోంది. ఇక సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినట్టుగా తెలుస్తోంది.
ఇక హీరో హీరోయిన్లు చేసిన పర్ఫామెన్స్ చాలా రోజులపాటు గుర్తుండిపోతోంది అంటూ ఈ సినిమాను చూసిన కొంతమంది సినిమా పెద్దలు తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఒక కల్ట్ క్లాసికల్ లవ్ స్టోరీగా నిలిచిపోతుందనేది వాస్తవం… వేణు ఉడుగుల ఇంతకుముందు చేసిన ‘విరాట పర్వం’ సినిమాలో కూడా లవ్ స్టోరీ చాలా అద్భుతంగా ఉంటుంది.
కానీ క్లైమాక్స్ కొంచెం తేడా కొట్టడంతో సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించలేదు. కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన అలాంటి డిసిజన్ ఏం తీసుకోకుండా ఒక హ్యాపీ లవ్ స్టోరీ ని చూపించాలనే ప్రయత్నం చేశాడు. అందులోనే స్ట్రగుల్స్ అందులోనే మెలికలు అందులోనే ఇబ్బందులు అందులోనే ఇష్టాలు అన్ని కలగలిపి చూపించాడు… చూడాలి మరి ఈ మూవీని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది…
