Raj ex-wife allegations: గత కొంత కాలం నుండి డేటింగ్ చేసుకుంటూ వచ్చిన సమంత(Samantha Ruth Prabhu), రాజ్ నిడిమోరు(Raj Nidimoru) నిన్న ఎట్టకేలకు కోయంబత్తూరు లో కుటుంబ సభ్యుల సమక్ష్యం లో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ షూటింగ్ సమయం లో వీళ్లిద్దరు స్నేహితులు అయ్యారు. ఇక ఎప్పుడైతే నాగ చైతన్య తో సమంత విడాకులు తీసుకుందో, అప్పటి నుండి వీళ్లిద్దరి బంధం మరింత బలపడింది. విడాకుల కారణంగా మనస్తాపానికి గురైన సమంత కి అండగా అప్పట్లో రాజ్ ఉండేవాడు. ఆ సమయం లోనే వీళ్లిద్దరి మనసులు కలిశాయని, ముఖ్యంగా సమంత కి మయోసిటిస్ వ్యాధి సోకినప్పుడు ఆమె వ్యవహారాలు మొత్తం రాజ్ దగ్గరుండి చూసుకునేవాడని, అప్పటి నుండే వీళ్లిద్దరు డేటింగ్ చేసుకుంటూ వచ్చారని అంటున్నారు.
ఇకపోతే రాజ్ నిడిమోరు మాజీ భార్య అప్పుడప్పుడు సమంత, రాజ్ జంటలను ఉద్దేశిస్తూ పరోక్షంగా కామెంట్స్ చేస్తూ ఉంటుంది. అలా నిన్న కూడా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ ‘ దేవుడు అన్నిచూస్తూనే ఉన్నాడు. కాలం అన్నిటికి సమాధానం చెప్తుంది. కర్మ ఫలితం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇది ఆమె రాజ్ ని ఉద్దేశించి పెట్టిందో, లేదంటే సమంత ని ఉద్దేశించి పెట్టిందో తెలియదు కానీ, సరిగ్గా వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్న సమయంలోనే ఇలాంటి పోస్ట్ స్టోరీ లో పెట్టిందంటే కచ్చితంగా వాళ్ళిద్దరిని ఉద్దేశించే పెట్టి ఉంటుందని అంటున్నారు. ఎంతైనా మాజీ భార్య, వేరే పెళ్లి చేసుకుంటే ఆ మాత్రం బాధ ఉండడం సహజమే కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరు కూడా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సీజన్ షూటింగ్ సమయం లోనే విడాకులు తీసుకున్నారని టాక్.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే, మయోసిటిస్ వ్యాధి సోకిన తర్వాత ఆమె సినిమాల సంఖ్య బాగా తగ్గించేసింది. చివరిసారిగా ఆమె హీరోయిన్ గా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘ఖుషి’. ఆ తర్వాత మళ్లీ ఈమె లీడ్ రోల్ లో కనిపించలేదు. ఈ ఏడాది ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ఈ చిత్రం లో ఆమె చిన్న పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నందిని రెడ్డి దర్శకత్వం లో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం లో నటించబోతుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రం గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘ఓ బేబీ’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది.