Homeఎంటర్టైన్మెంట్'రియా చక్రవర్తి' మళ్ళీ ప్రేమలో పడిందా ?

‘రియా చక్రవర్తి’ మళ్ళీ ప్రేమలో పడిందా ?

ajiv Lakshman Rhea Chakraborty
‘రియా చక్రవర్తి’ గత కొన్ని నెలలుగా మొత్తం ఇండియా వైడ్ గా హల్ చల్ చేసిన నేమ్. ఎన్నో అనుమానాలు, మరెన్నో అపవాదులు.. చివరకు జైలు జీవితం.. ఏది ఏదైతే ఏమి.. చివరకు ఎలాగోలా డ్రగ్స్ కేసులో బెయిల్ పై బైటికి వచ్చాకా, కొన్నాళ్ళు ఎవరికీ కనిపించలేదట. కేవలం, ఇంట్లోనే కూర్చుని తన పై వచ్చిన కథనాలను చదువుకుంటూ టైం పాస్ చేసింది. కానీ మీడియా వదలదుగా.. ఆమె వెంటపడినా.. ఆమె మాత్రం మీడియాతో మాట్లాడటం లేదు. తన జీవితం తనది అన్నట్లుగా సైలెంట్ అయిపోయి, సైడ్ అయిపోతుంది.

Also Read: నేను మహేష్‌ కి వదినను కాను: రేణు దేశాయ్‌

ఐతే మొత్తానికి 2021లో తన జీవితాన్ని ఫ్రెష్ గా రీస్టార్ట్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయి రెచ్చిపోతుంది రియా. ఈ క్రమంలో మళ్ళీ సినిమాల్లో నటించేందుకు ఫిల్మ్ మేకర్స్ చుట్టూ తిరుగుతూ ఛాన్స్ లను వెతుక్కుంటూ ఉంది. కొంతమంది ఆమె పాత ఫ్రెండ్స్ ఆమెకు కొంత సపోర్ట్ చేస్తోన్నట్లు ఉన్నారు. ఆ ప్రాసెస్ లో రాజీవ్ లక్ష్మణ్ అనే అతన్ని కూడా కలిసి సరదగా అతనితో కాసేపు గడిపింది రియా. ఇంతకీ ఎవరు అతను అంటే.. “రోడీస్” అనే టీవీ షోతో పాపులర్ అయిన వ్యక్తి. రియా రాగానే హగ్ చేసుకొని నవ్వుతూ పోజులిచ్చి.. ఆ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నెటిజన్లకు మంచి స్టఫ్ ఇచ్చాడు.

Also Read: టీజర్ టాక్: ‘కోబ్రా’తో అదరగొట్టిన విక్రమ్ !

పైగా ఫోటో పోస్ట్ చేస్తూ… “మై గర్ల్” అంటూ ఆ ఫోటోకి కాప్షన్ కూడా పెట్టాడు బాబు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ప్రేమ వ్యవహారం, అతను ఆత్మహత్య ఆరోపణల నుండి ఇంకా బయట పడని రియా.. ఇప్పుడు కొత్తగా మళ్లీ ప్రేమలో పడిందా అంటూ రియా పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్యాన్స్. ఈ కొత్త ఫోటోని బాగా వైరల్ చేసి ఆమెని బద్నామ్ చేసే పనిలో పడ్డారు. దాంతో, వెంటనే రాజీవ్ లక్ష్మణ్ ఆ ఫోటోని డిలీట్ చేస్తూ.. “నేను రాసిన కొన్ని పదాలతో అనవసర సమస్యని క్రియేట్ చేశాను. క్షమించండి. రియా మంచి ఫ్రెండ్. చాలా నెలల తర్వాత ఆమె కలవడంతో ఆనందం వేసింది. ఆమెకి బెస్ట్ విషెస్. తప్పుగా రాయొద్దు,” అంటూ అంతా అయిపోయాక.. ఈ రాజీవ్ లక్ష్మణ్ అనే వ్యక్తి నీతి వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular