Hero Nani- Anchor Suma: హీరో నాని మీద రాజీవ్ కనకాల ఫైర్ అయ్యారట. అర్ధరాత్రి సుమకు కాల్ చేయడంతో ఆయన ఎవడ్రా నువ్వు మూసుకుని ఫోన్ పెట్టేయ్ అన్నాడట. విషయంలోకి వెళితే సుమ పేరుకే యాంకర్ కానీ ఆమెకు భారీ ఫేమ్ ఉంది. చిరంజీవి వంటి బడా హీరోలు కూడా ఆమెను గౌరవంగా చూస్తారు. హీరోలు, దర్శకులు సుమ గారు అని సంబోధిస్తారు. ఆమె రేంజ్ అలాంటిది. వందల ప్రీ రిలీజ్ ఈవెంట్స్, టాలీవుడ్ ఈవెంట్స్ కి యాంకర్ వ్యవహరించిన సుమకు అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
జనరేషన్స్ తో సంబంధం లేకుండా అందరు హీరోలు సుమను అభిమానిస్తారు. హీరో నానితో ఆమెకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సుమ యాంకర్ గా ఉన్న పలు షోలలో నాని పాల్గొన్నాడు. ఇద్దరి మధ్య పంచ్లు, కౌంటర్లు బాగుంటాయి. ఈ సాన్నిహిత్యం నేపథ్యంలో నాని ఒకసారి సుమకు ఫ్రాంక్ కాల్ చేశారట. అది కూడా అర్థరాత్రి ఫోన్ చేసి… ఓ సినిమా ఉంది. మీరు హీరోయిన్ గా నటించాలి. సినిమాకు ఎలాంటి రెమ్యూనరేషన్ ఉండదు. ప్లాప్ అయితే మాత్రం మీరే ఎదురు డబ్బులు చెల్లించాలని, అన్నారట.
కన్ఫ్యూషన్ లో ఉన్న సుమ పక్కనే ఉన్న భర్త రాజీవ్ కి ఫోన్ ఇచ్చారట. రాజీవ్ కనకాల చిరాగ్గా.. ఎవడ్రా నువ్వు, ముందు ఫోన్ పెట్టేయ్ అని ఫైర్ అయ్యాడట. ఈ ఫ్రాంక్ కాల్ రాంగ్ టర్న్ తీసుకుందని భయపడ్డ నాని మరలా తన అధికారిక నంబర్ నుండి ఫోన్ చేసి విషయం చెప్పాడట. అయితే తాము కూడా రివర్స్ ఫ్రాంక్ చేసినట్లు సుమ నానికి షాక్ ఇచ్చారట. ఇలాంటి ఓ సంఘటన చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.
యాంకర్ సుమ కూడా హీరోయిన్ కావాలనుకున్నారు. 1996లో కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీతో సుమ వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు కాగా సుమ కనకాల హీరోయిన్. వక్కంతం వంశీ హీరో. కళ్యాణ ప్రాప్తిరస్తు ప్లాప్ కావడంతో ఆమె నిరాశకు గురయ్యారు. మరో రెండు మలయాళ చిత్రాల్లో నటించారు. అనంతరం యాంకర్ గా మారి సక్సెస్ అయ్యారు.