సూర్య హీరోగా వచ్చిన ‘జైభీమ్’ మూవీ సంచలనాలు సృష్టిస్తోంది. ఓటీటీ వేదికగా విడుదలయిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సినిమాలోని నటీనటులకు గుర్తింపు వచ్చింది. ఇందులో సూర్య మినహా దాదాపు మిగతా వారందరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేనివారే. కానీ వారు నటించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా సూర్య పక్కన నటించిన రాజిష విజయన్ గురించి టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ‘జై భీమ్’ సినిమాలో టీచర్ గా నటించిన రాజిష గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈమె తమిళ సినిమాల్లో ఇదివరకే నటించారు. కానీ ఈ సినిమాతో గుర్తింపు వచ్చింది. ఇక ఈ భామ త్వరలో తెలుగు సినిమాలోనూ కనిపించనుంది.

రాజీష కేరళలో 1991లో జన్మించింది. ఆమె తండ్రి విజయన్ ఆర్మీలో చేసేవారు. తల్లి గృహిణి. రాజిష కు ఓ చెల్లులు కూడా ఉంది. రాజిష నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ లో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసింది. స్టడీ పూర్తయిన తరువాత ఆమె యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తరువాత ‘అనురాగ కరిక్కన్ వెల్లం’ అనే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో రాజిషకు గుర్తింపు వచ్చింది.
ఆ తరువాత ఈమె తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కొన్ని సినిమాల్లో నటించిన తరువాత సూర్యతో నటించే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా విజయం సాధించడంతో రాజిష కు ఆఫర్ల ఇంటిదారిపట్టాయి. తమిళంలోనూ కాకుండా తెలుగులోనూ ఆమెకు భారీ ఆఫర్స్ వస్తున్నాయి. త్వరలోనే ఆమె రవితేజ పక్కన ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో నటించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక రాజీష ‘జై భీమ్’ సినిమాలో మారుమూల గ్రామాల్లోని ప్రజలకు చదువు నేర్పేటీచర్ గా కనిపించారు. ఇందులో సాంప్రదాయంగా కనిపించిన రాజిష తన నటనను ఇలాగే కొనసాగిస్తారా..? లేక గ్లామర్ పాత్ర పోషిస్తారా..? అని చర్చించుకుంటున్నారు. అయితే వచ్చిన అవకాశాన్ని మాత్రం రాజిష వదలుకోవడం లేదని అంటున్నారు. అయితే తెలుగులో రాజిష ఏ విధంగా కనిపిస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక రాజిష గురించి సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.