Annathe: సూపర్‌స్టార్ రజనీకాంత్ పేరు వింటే చాలు ఎవ్వరికైనా బాడీలో వైబ్రేషన్స్ మొదలవుతాయి. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్ల ముందు పండగ వాతావరణం నెలకొంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసు వారు ఆయన అభిమానులే. పేటా, దర్బార్తో ప్రేక్షకులను అలరించిన రజనీ.. ఇప్పుటు అన్నాత్తై తో అదరకొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ అందరి అంచనాలు మించేలా చేసింది. మరోవైపు ఈ సినిమాను తెలుగులో పెద్దన్న పేరుతో రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ చిత్రాన్ని ఓవర్సీస్ మార్కెట్లో భారీ స్థాయిలో విడుదల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
లాక్డౌన్ తర్వాత భారత్ నుంచి ఏ చిత్రం విడుదల కానన్ని లొకేషన్స్‌లో అన్నాత్తైను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. దీన్నిబట్టి ప్రపంచవ్యాప్తంగా రజనీ క్రేజ్ ఓ రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇందులో రజనీకాంత్ సరసన నయనతార నటిస్తుండగా. కోలీవుడ్ దర్శకుడు శివ దర్శకత్వం వహిస్తున్నారు. మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డి ఇమన్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రోబో తర్వాత అంతగా విజయ సాధించని రజనీ.. ఈ సినిమాతోనైనా మళ్లీ హిట్ కొట్టాలని భావిస్తున్నారు. మధ్యలో వచ్చిన రోబో2.O ప్రేక్షకుల్ని ఎంతగానే నిరాశపరిచింది. ఆ తర్వాత వచ్చిన కబాలి, పేటా, దర్బార్ చిత్రాలు థియేటర్లలో అకట్టుకోనప్పటికీ మెల్లగా ప్రేక్షకులు ఇష్టపడటం ప్రారంభించారు. దీన్ని బట్టి రోబో 2.O ప్రభావం ఎంతగా పడిందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సారైనా అన్నాత్తైతో హిట్ కొడతాడా లేదా తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.