Rajinikanth Wedding Card: రజినీకాంత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. లవ్ యట్ ఫస్ట్ సైట్ అన్నట్లు తొలిచూపులోనే రజినీకాంత్ లత మాయలో పడిపోయారు. ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం నాటి రజినీకాంత్-లత వెడ్డింగ్ రిసెప్షన్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఏముందో చూద్దాం. అప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు రజినీకాంత్. ఆయనకు యూత్ లో ఫాలోయింగ్ పెరిగింది. లతా రంగాచారి ఎతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమన్ లో డిగ్రీ చదువుతుంది.
కాలేజ్ మ్యాగజైన్ కోసం రజినీకాంత్ ని ఇంటర్వ్యూ చేయాలని ఆమె భావించారు. తెలిసిన వాళ్ళ ద్వారా రజినీకాంత్ తో అప్పాయింట్మెంట్ సాధించారు. లత అందానికి రజినీకాంత్ ముగ్దుడు అయ్యాడు. ఆ ఇంటర్వ్యూ ముగిసే లోపు తన మనసులోని కోరిక బయపెట్టాడు . నువ్వంటే నాకు ఇష్టం. నీకు ఇష్టమైన పెళ్లి చేసుకుందాం, అన్నాడట. ఊహించని పరిణామానికి లత షాక్ అయ్యారట.
నేను ఇప్పుడే చెప్పలేను. పెద్దవాళ్ళను సంప్రదించి నా నిర్ణయం చెబుతానని లత వెళ్లిపోయారట. లత పేరెంట్స్ కూడా పెళ్ళికి అంగీకరించడంతో 1981 ఫిబ్రవరి 26న తిరుమల శివారి సన్నిధిలో వివాహం చేసుకున్నారు. పెళ్ళైన రెండు వారాలకు చిత్ర ప్రముఖుల కోసం వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సదరు వెడ్డింగ్ రిసెప్షన్ లో రజినీకాంత్-లత ఫోటోలతో పాటు హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు సింపుల్ గా రెండు వాక్యాల్లో రాసి ఉంది.
ఆ రోజుల్లో చెన్నై నగరంలో లగ్జరీ హోటల్స్ లో ఒకటైన తాజ్ కోరోమండల్ లో రజినీకాంత్-లత వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. రజినీకాంత్-లతలకు ఇద్దరు సంతానం.కూతుళ్లు సౌందర్య, ఐశ్వర్య చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. దర్శకత్వ విభాగంలో పని చేస్తున్నారు. 90లలో రజినీకాంత్-లత విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. మనస్పర్థలు వచ్చిన మాట వాస్తవమే కానీ తిరిగి కలిసిపోయారట.