Rajinikanth Vs Nagarjuna: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు తమిళం లో సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆ సినిమా తెలుగులో డబ్ అయి తెలుగు ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తెలుగులో కూడా ఆయనకు మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ప్రస్తుతం ఇండియా వైడ్ గా రజనీకాంత్ అంటే తెలియని వాళ్ళు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో చేస్తున్న కూలో సినిమాను ఈనెల 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే లోకేష్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలుపుతాడా? లేదంటే డివైడ్ టాక్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనే ధోరణిలో కూడా ఇప్పుడు కొంతమంది ప్రేక్షకుల్లో ఆసక్తి అయితే నెలకొంది… మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటిస్తే నాగార్జున విలన్ పాత్రను పోషిస్తున్నాడు. సైమన్ అనే క్యారెక్టర్ ను పోషిస్తునాడు. ఇప్పటివరకు ఆయన చేయనటువంటి ఒక గొప్ప పాత్రని పోషించి తనను తాను మరొకసారి ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఆయనకు ఎంతవరకు హెల్ప్ అవుతొంది… కెరియర్ పరంగా ఆయనకి మంచి గ్రోత్ ని ఇస్తుందా? విలన్ గా కూడా ఆయన విలక్షణమైన నటనను ప్రదర్శిస్తాడా నాగార్జున ఇక మీదట విలన్ గా కూడా సెట్ అవుతాడు అనే ఒక నమ్మకాన్ని ప్రేక్షకుల్లో సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
రజనీకాంత్ సైతం మాట్లాడుతూ నాగార్జున క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుందని చెప్పాడు. అంటే వీళ్లిద్దరిలో ఎవరు ఎవరిని డామినేట్ చేయబోతున్నారు. నాగార్జున రజనీకాంత్ ను డామినేట్ చేస్తే మాత్రం విలనిజం అనేది బాగుంటుంది. అలాగే సినిమా అల్టిమేట్ గా వచ్చి మంచి సక్సెస్ ను సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నాగార్జున పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా మారిపోతుందట…
ఇక ఇప్పటివరకు నాగార్జున రజనీకాంత్ కాంబినేషన్ లో సినిమా అయితే రాలేదు. మరి ఇప్పుడు వచ్చిన ఈ సినిమా ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటుంది.నాగార్జున యాక్టింగ్ కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఎవరు ఎవరిమీద పై చేయి సాధించబోతున్నారు అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారబోతోంది.
ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా విషయంలో ఇప్పటికి లోకేష్ కనకరాజు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందనే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్న లోకేష్ కనకరాజు తన అభిమానులకు ఈ సినిమా కన్నుల పండుగగా మారబోతోందని చెబుతున్నాడు…