Rajinikanth and Junior NTR : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో కనీవినీ ఎరుగని రేంజ్ బాక్స్ ఆఫీస్ క్లాష్ ఈ ఏడాదిలో జరగబోతుందా?, సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) తో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) తలపడే సాహసం చేస్తున్నాడా? ఏమో కచ్చితంగా ఈ సీన్ ఈ ఏడాది జరిగే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్(Lokesh Kanakaraj) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కూలీ'(Coolie Movie) చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆగష్టు 14 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. రజినీకాంత్ స్టైల్ లో విజిల్ వేస్తున్న స్టిల్ తో ఈ పోస్టర్ ని విడుదల చేయగా, అది సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేసింది.
Also Read : రజినీకాంత్ కూలీ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించబోతుందో తెలుసా..?
ఈ సినిమా విడుదలయ్యే రోజే ఎన్టీఆర్, హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వార్ 2′(War 2 Movie) మూవీ విడుదల కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన కొత్తల్లోనే విడుదల తేదీని లాక్ చేసుకున్నారు. బాలీవుడ్ లో ఒక సినిమాకు విడుదల తేదీని ప్రకటించిన తర్వాత వాయిదా పడడం వంటివి ఇప్పటి వరకు హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు. కేవలం రెండు మూడు సార్లు మాత్రమే వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రీసెంట్ గా కూడా యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని ఆగష్టు 14న విడుదల చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. షూటింగ్ కార్యక్రమాలు కూడా ఒక్క క్లైమాక్స్ మినహా మొత్తం పూర్తి అయ్యినట్టే. ఒక సాంగ్ షూటింగ్ కూడా బ్యాలన్స్ ఉంది. కాబట్టి ఈ సినిమా వాయిదా పడే అవకాశాలే లేవు. కూలీ చిత్రం తో క్లాష్ వద్దు అనుకొని వారం ముందుకు, లేదా వారం వెనక్కి వెళ్తే తప్ప, ఈ సినిమా వాయిదా వేయడానికి కారణాలు లేవు.
ప్రస్తుతానికి అయితే రజినీకాంత్ కూలీ చిత్రానికి ఉన్నంత క్రేజ్ ‘వార్ 2’ చిత్రానికి లేదు. ‘వార్ 2 ‘ కేవలం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్నా మల్టీ స్టార్రర్ అనే క్రేజ్ మాత్రమే ఉంది. సినిమా కంటెంట్ మీద ఎలాంటి హైప్ లేదు. ఎందుకంటే ‘వార్’ చిత్రం కూడా గొప్పగా ఏమి ఉండదు కాబట్టి. ఇలాంటి యాక్షన్ చిత్రాలు చూసి చూసి ఆడియన్సు కి బోర్ కొట్టేసింది. అందుకే ఈ యూనివర్స్ నుండి విడుదలైన ‘టైగర్ 3’ చిత్రం పెద్ద హిట్ కాలేకపోయింది. మరోపక్క ‘కూలీ’ విషయానికి వస్తే, ఈ చిత్రానికి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్, సౌత్ లో దాదాపుగా క్రేజీ స్టార్స్ అందరూ ఇందులో నటించారు. కాబట్టి ఈ సినిమా పై క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు, తెలుగు లో కూడా చిత్రం ‘వార్ 2’ డామినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Also Read : జపాన్ థియేటర్స్ లో ఎన్టీఆర్ మేనియా..గూస్ బంప్స్ రప్పించే వీడియో!