Rajinikanth And Kamal: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో కమలహాసన్, రజనీకాంత్ మొదటి స్థానంలో ఉంటారు. వీళ్లిద్దరు చేసిన సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ని క్రియేట్ చేయడమే కాకుండా తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి మొత్తానికైతే వీళ్ళు సాధించిన విజయాలు మరే హీరోలకి దక్కలేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక మొత్తానికైతే రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ తన ధైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే కమలహాసన్ చేయాల్సిన ఒక మూడు సినిమాలని రజనీకాంత్ చేసి సూపర్ సక్సెస్ లను సాధించారనే విషయం మనలో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ముత్తు సినిమాని మొదట కమలహాసన్ తోనే చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల కమలహాసన్ ఆ సినిమాకి డేట్స్ ని అడ్జస్ట్ చేయలేకపోయాడు.
దాంతో రజనీకాంత్ తో కే ఎస్ రవికుమార్ ఈ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత సురేష్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన భాష సినిమాని కూడా మొదట కమల్ హాసన్ కి చెప్పారట. కానీ అందులో మాఫియా డాన్ గా కనిపించడం, ఆ బ్యాక్ డ్రాప్ సెటప్ అంతా కమల్ హాసన్ కి నచ్చలేదట.
అందువల్లే ఆయన ఆ స్టోరీని రిజెక్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దాంతో పాటుగా రజినీకాంత్ కెరియర్ లోనే సూపర్ హిట్ గా నిలిచిన రోబో సినిమాని కూడా మొదట శంకర్ కమల్ హాసన్ తోనే చేయాలనుకున్నాడు. కానీ అది కూడా కమలహాసన్ చేయలేకపోయాడు కారణమేదైనా కూడా కమలహాసన్ వదిలేసిన ఈ మూడు సినిమాలను రజనీకాంత్ చేసి సూపర్ సక్సెస్ ఫుల్ హీరోగా మారడం అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయం అనే చెప్పాలి.
రజినీకాంత్ లాంటి నటుడు సినిమా ఇండస్ట్రీలో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ రజినీకాంత్ నెంబర్ వన్ హీరోగా కొనసాగడంలో ఈ మూడు సినిమాలు కీలకపాత్ర వహించాయనే చెప్పాలి… కమల్ హాసన్ ఈ మూడు సినిమాలు మిస్ చేసుకొని చాలా వరకు పొరపాటు చేశారని అభిమానులు కూడా అనుకుంటున్నారు. మరి మొత్తానికైతే కమలహాసన్ కూడా లోకనాయకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ముందుకు సాగుతున్నాడు…