PM Narendra Modi : వరదలకు అతలాకుతలమైన ఆంధ్రాని ఆదుకోవడంలో కేంద్రం పిసినారితనం చూపింది. ఉదారంగా వుంటారనుకున్న ప్రధాని మోడీ గుజరాతీ షావుకారులానే వ్యవహరించారే తప్ప ఆదరించిన తెలుగువాడ్ని అన్నవలె ఆదుకోలేకపోయాడు. కొత్తగా కొలువుదీరిన తమ భాగస్వామ్యనప్రభుత్వమే అయినా, ఆపదలో ఆదుకొని గట్టెక్కించకపోవడం వెనక ఇంకేదైనా మతలబు వుందేమోననే సందేహం కొన్ని వర్గాల్లో తలెత్తింది.
◆ మోడీకి జీ హుజుర్ అన్నా నమ్మడం లేదా..? :
కేంద్రంలో మూడోసారి మోడీ సర్కారు కొలువుదీరినా, అది చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు ఏపీలోనట్లుగా ఏపీలో టీడీపీ, బీహార్ లో నితీష్ కుమార్ పార్టీ అండతోనే. పదేళ్ళపాటు కేంద్రంలో ఏకఛత్రాధిపత్యం సాధించిన బీజేపీకి, మోడీకి దక్షిణాదిలో మాత్రం కర్ణాటక దాటి ఆదరణ దక్కలేదు. దక్షిణాది తన వశమవడం లేదనే అక్కసు మోడీ లో కనిపిస్తోంది. తన అధికార బలంతో ఈసారైనా దక్షిణాధిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే కసి మోడీలో ఉంది. అందుకే ఆయన దక్షిణాది రాష్ట్రాల సీఎం ప్రాబల్యం పెరగకుండా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలనైతే వీలైనంత తొక్కేయాలని చూస్తూన్నారు. కర్ణాటక సీయం సిద్ధరామయ్య ఇరుక్కున్న ముడా స్కామ్, అక్కడి కాంగ్రెస్ శక్తి డీకే శివకుమార్ పై ఈడీ వేధింపులు ఇందుకు నిదర్శనం అయితే, తాజాగా వరద సాయంలో తెలంగాణాని పూచిక పుల్లలా తెసేపడేయడం మరో నిదర్శనం. తమ భాగస్వామే అయినా ఏపీ సీయం చంద్రబాబు నాయుడుకి వరద సాయంలో నిరుత్సాహమే దక్కిడం మోడీ రాజకీయ ఆటలో భాగమే. ఏపీలో మోడీ విశ్వసనీయ భాగస్వామి జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద సాయం అడిగినంత ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడానికి బదులు తిరుపతి లడ్డూ వివాదాన్ని ఆసరాగా చేసుకొని బీజేపీ సిద్ధాంతాన్ని బలపరుస్తూ పరిహార దీక్ష చేపట్టి జనాన్ని హిందూత్వ వైపు డైవర్ట్ చేయడం కూడా మోడీ ప్లాన్ లో భాగమేననే చర్చ సాగుతోంది. కాలం కలిసొస్తే మళ్ళీ ఎన్నికల నాటికి ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ని అడ్డంపెట్టి కాషాయజెండా ఈ చేష్టల వెనక మోడీ వ్యూహంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తూన్నారు. మొత్తానికి దక్షిణాధిపై మోడీ శీతకన్నేయడం వెనక రాజకీయ కోణమే కారణమనేది మాత్రం వాస్తవం.