https://oktelugu.com/

Rajinikanth: జైలర్ సినిమా కేవలం అబోవ్ యావరేజ్ .. అనిరుద్ వల్లే ఇదంట: రజనీకాంత్

విడుదలైన అన్ని భాషల్లో కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.650 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సూపర్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ని అరేంజ్ చేశారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 19, 2023 / 07:16 PM IST

    Jailer

    Follow us on

    Rajinikanth: ఎన్నో రోజుల తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఆయన లెవల్ కి తగిన హిట్ వచ్చింది.‌ దాదాపు శివాజీ, రోబో సినిమాల తర్వాత రజినీకాంత్ కి అక్బస్టర్లు అయితే రాలేదు. కానీ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు సూపర్ స్టార్.

    వరుణ్ డాక్టర్, బీస్ట్ సినిమాలు తీసిన నెల్సన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక నెల్సన్ రజనీకాంత్ కి ఎన్నో సంవత్సరాల తర్వాత సూపర్ హిట్ ఇవ్వటంతో రజిని అభిమానులు ఆదర్శకుడిని ఆకాశానికి ఎత్తేశారు. కాగా ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

    విడుదలైన అన్ని భాషల్లో కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.650 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సూపర్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ని అరేంజ్ చేశారు. ఈ సెలబ్రేషన్స్‌లో చిత్ర బృందంలో సభ్యులకు ఒక బంగారు నాణెం, షీల్డ్ అందజేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ముందుగా ఈ సినిమా నిర్మాత గురించి అలానే నిర్మాత తనకు ఇచ్చిన బహుమానం గురించి చెబుతూ…’కళానిధి మారన్‌ సర్‌కి థ్యాంక్స్‌ చెప్పాలనుకుంటున్నాను. ఆడియో లాంచ్‌తో మొదలు పెట్టి అన్నింటిలోనూ ఆయన మార్క్ చూపించారు. సినిమా హిట్ అవ్వగానే ఆర్టిస్టులందరినీ పిలిచి విందు భోజనం పెట్టారు. తర్వాత నాకు, డైరెక్టర్‌కి, అనిరుధ్‌కి కార్లు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన కారులోనే వచ్చాను. నేను ధనవంతుడినని భావిస్తుంటాను. నేను ఆ కారులో కూర్చున్నప్పుడు కూడా అలాగే అనిపించింది.అందరికీ షీల్డ్‌లు ఇచ్చారు. అలాగే ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. ఈ బ్యాగ్ ఏంటి అని అడిగితే.. అందులో ఒక గోల్డ్ కాయిన్ ఉందని నెల్సన్ చెప్పారు. సో నైస్ కళ సర్. సినిమాని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, సినిమా సక్సెస్ అయితే ఆర్టిస్టులను ఎలా గౌరవించాలో కళ సర్‌ని చూసి నేర్చుకోవాలి’ అని తెలియజేశారు రజిని.

    ఇక ఆ తరువాత సినిమా గురించి మాట్లాడుతూ.. ‘సినిమా పూర్తయిన తరవాత ఎలా ఉందని సెంబియన్, కన్నన్‌ను కళ సర్ అడిగారు. చాలా బాగుంది సర్ అని కన్నన్ అన్నాడు. నువ్వు నెల్సన్ స్నేహితుడివి, నువ్వు అబద్ధం చెప్పే అవకాశం ఉంది.. సెంబియన్ నువ్వు చెప్పు అన్నారు. వెంటనే సెంబియన్ యావరేజ్ సర్ అన్నాడు. నిజం చెప్పాలంటే రీరికార్డింగ్‌కు ముందు నాకు కూడా సినిమా అబోవ్ యావరేజ్ అనిపించింది. కానీ అనిరుధ్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. అసలు ఏం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అతను ఇప్పుడు నా కొడుకు. నాకు హిట్టు ఇచ్చాడు, అతడి ఫ్రెండ్ నెల్సన్‌కు హిట్టు ఇచ్చాడు’ అని రజనీకాంత్ వెల్లడించారు.

    కాగా ఇలా సినిమా బ్లాక్ బస్టర్ అయిన తరువాత కూడా రజినీకాంత్ తాను తన సినిమాని కేవలం అబౌ యావరేజ్ అనుకున్నారు అని చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది.